pingali nagendra rao
-
కాశీకి పోయాను రామాహరి...
అబద్ధంలో ఆకర్షణ ఉంటుంది. అందుకే మనుషులు అబద్ధాల మాయలో పడిపోతారు. ఏ కొందరో ఆ అబద్ధాల నిగ్గు తేలుస్తారు. ‘ఇదీ నిజం’ అని చెప్పడానికి దీక్ష పూనుతారు. అబద్ధాలపై సమరశంఖం పూరిస్తారు.అబద్ధాల్లోని డొల్లతనాన్ని కనిపెట్టి చెప్పేవారు పక్కన లేకపోతే ఎంతటివారైనా బొక్కబోర్లా పడవలసిందే. ‘అప్పు చేసి పప్పు కూడు’ (1958) సినిమాలో పాట ఒకటి ఉంది. అందులో రేలంగి చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన శిష్యురాలు పక్కనే ఉండి నిజం చెప్పబట్టి అమాయక ప్రజలు ఆ మాయ నుంచి బైటపడతారు. ‘కాశీకి పోయాను రామాహరి... గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి’ అంటాడు రేలంగి. ‘కాశీకి పోలేదు రామాహరి... ఊరి కాల్వలో నీళ్లండి రామాహరి’ అని గిరిజ చెబుతుంది. అంతటితో ఊరుకోడు రేలంగి. ‘శ్రీశైలం వెళ్లాను రామాహరి... శివుని విభూతి తెచ్చాను రామాహరి’ అంటాడు. గిరిజ మాత్రం ఊరుకుంటుందా! ‘శ్రీశైలం పోలేదు రామాహరి... ఇది కాష్ఠంలోని బూడిద రామాహరి’ అంటుంది. రేలంగి అబద్ధాలు అక్కడితో ఆగవు. ‘అన్నమక్కరలేదు రామాహరి... నేను గాలి భోంజేస్తాను రామాహరి’ అంటాడు. ‘గాలితోపాటు రామాహరి... వీరు గారెలే తింటారు రామాహరి... నేతి గారెలే తింటారు రామాహరి’... అని గిరిజ అంటుంది. రేలంగి గుర్రున చూస్తాడు. ఇక లాభం లేదనుకుని... ‘కైలాసం వెళ్లాను రామాహరి... శివుని కళ్లార చూశాను రామాహరి’ అంటాడు.‘కైలాసం వెళితేను రామాహరి... నంది తన్ని పంపించాడు రామాహరి’ అని గిరిజ అసలు సంగతి బయటపెడుతుంది. 57 ఏళ్ల క్రితం పింగళి నాగేంద్రరావు రాసిన ఈ పాట... ఇప్పుడున్న కొందరు లీడర్ల అబద్ధాలకూ చక్కగా సూట్ అవుతుంది! -
నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి
పల్లవి : ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరీ (2) చరణం : 1 మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినటుల ॥ వన్నెలతో చిన్నెలతో మనసుగొనిన ఊహాసుందరి ॥నా చెలి॥ చరణం : 2 కలువ కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి వినయసహన శోభలతో తనివినించు సుగుణసుందరి ॥నా చెలి॥ పల్లవి : ఏమి శిక్ష కావాలో కోరుకొనవె ప్రేయసీ కోరుకొనవె ప్రేయసీ...॥ మురిపెముగా ముచ్చటగా ముద్దుముద్దుగా (2) ॥ చరణం : 1 ఆశలేవో తెలుసుకొని వేసమలా వేసుకొని (2) ముసిముసి నవ్వులతో నా ముందు నిలచినందులకు చరణం : 2 ఆవరించు చీకటిలో... ఓ... ఆవరించు చీకటిలో దారిచూపు దీపికవై దారిచూపు దీపికవై... జీవితమును నవశోభల వెలయజేసినందులకు చిత్రం : చంద్రహారం (1954) రచన : పింగళి నాగేంద్రరావు సంగీతం, గానం : ఘంటసాల -
గీత స్మరణం
పల్లవి : బాలనురా మదనా... బాలనురా మదనా విరితూపులు వేయకురా మదనా బాలనురా మదనా... చరణం : 1 నిలచిన చోటనె నిలువగ నీయక... (2) వలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా ॥ చరణం : 2 చిలుకలవలె గోర్వంకల వలెనూ... (2) కులుకగ తోచునురా తనువున పులకలు కలుగునురా మదనా ॥ చరణం : 3 చిలిపికోయిలలు... చిలిపికోయిలలు చిత్తములోనె కలకల కూయునురా మనసును కలవరపరచునురా మదనా ॥ గానం : పి.సుశీల పల్లవి : ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో... ఓ... ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో... చిత్రములన్నీ నావేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2) చరణం : 1 తళుకుతళుకుమని తారలు మెరిసే నీలాకాశము నాదేలే ఎల్లరి మనముల కవలరపరిచే... జిలిబిలి జాబిలి నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2) చరణం : 2 ప్రశాంత జగమును హుషారుచేసే వసంత ఋతువు నాదేలే పూవులు ఘుమఘుమ చల్లగ విసిరే మలయమారుతము నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2) గానం : ఎ.ఎం.రాజా చిత్రం : మిస్సమ్మ (1955) రచన : పింగళి నాగేంద్రరావు సంగీతం : సాలూరి రాజేశ్వరరావు