గీత స్మరణం
పల్లవి :
బాలనురా మదనా...
బాలనురా మదనా
విరితూపులు వేయకురా మదనా
బాలనురా మదనా...
చరణం : 1
నిలచిన చోటనె నిలువగ నీయక... (2)
వలపులు కురియునురా
తీయని తలపులు విరియునురా మదనా
॥
చరణం : 2
చిలుకలవలె గోర్వంకల వలెనూ... (2)
కులుకగ తోచునురా
తనువున పులకలు కలుగునురా మదనా
॥
చరణం : 3
చిలిపికోయిలలు...
చిలిపికోయిలలు చిత్తములోనె
కలకల కూయునురా
మనసును కలవరపరచునురా మదనా
॥
గానం : పి.సుశీల
పల్లవి :
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో... ఓ... ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో...
చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2)
చరణం : 1
తళుకుతళుకుమని తారలు మెరిసే
నీలాకాశము నాదేలే
ఎల్లరి మనముల కవలరపరిచే...
జిలిబిలి జాబిలి నాదేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2)
చరణం : 2
ప్రశాంత జగమును హుషారుచేసే
వసంత ఋతువు నాదేలే
పూవులు ఘుమఘుమ చల్లగ విసిరే
మలయమారుతము నాదేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే (2)
గానం : ఎ.ఎం.రాజా
చిత్రం : మిస్సమ్మ (1955)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు