![Saluri Rajeshwararao Prathibha Puraskaram For Singeetham Srinivas - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/6/Singee.jpg.webp?itok=UCyuLPvh)
రసమయి సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రతీ సంవత్సరం ప్రధానం చేసే డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు ప్రతిభా పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారిని ఎంపిక చేశారు. సంగీత దర్శకులుగా తెలుగు సినీ రంగానికి సేవలందించిన సాలూరి రాజేశ్వరరావు రఘపతి వెంకయ్య అవార్డు, కళైమామని, సంగీత సామ్రాట్‌గా సినీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులు.
ఆయన పేరున ఈ సంవత్సరం 18వ పురస్కారంగా సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ నెల 10 తేదీ సాయంత్ర 5.30 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో ప్రధానం చేయడం జరుగుతుందని అదే సందర్భంలో రసమయి ప్రేరణతో సాలూరి రాజేశ్వరరావుగారిపై భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన సాలూరి రాజేశ్వరరావు ప్రత్యేక తపాల చంద్రిక (సాలూరి స్పెషల్ పోస్టల్ కవర్) ఆవిష్కరణ జరుగుతుందని రసమయి అధ్యక్ష్యులు ఎంకె రాము తెలిపారు.
ఈ కార్యక్రమంలో జంట నగరాల్లోని సుప్రిసిద్ధ గాయని గాయకులు సాలూరి రాజేశ్వరరావుగా రు స్వరపరచిన గీతాలను ఆలపిస్తారని తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా కె. రోశయ్య, సభాధ్యక్షులుగా శ్రీ రుద్రరాజు పద్మరాజు,. సాలూరి తపాలా చంద్రిక ఆవిష్కర్తగా బ్రిగేడియర్ చంద్రశేఖర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరి కోఠి, సాలూరి వాసూరావు, సాలూరి పూర్ణచంద్రరావు, మాధవ పెద్ది సురేష్ పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment