Singeetham Srinivasa Rao
-
లెజండరీ డైరెక్టర్ సింగీతం ఇంట విషాదం
లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’అని సింగీతం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. భార్య లక్ష్మీ కల్యాణితో సింగీతం 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది.సింగీతం సీనీ కెరీర్లో ఆమె కీలక పాత్ర పోషించారు. సినిమా స్క్రిప్ట్ రాయడంలో ఆయనకు సహాయం చేసేశారు. లక్ష్మీ కల్యాణి గురించి ఆయన ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభాస్ నటించబోతున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కే’మూవీకి తొలుత కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు. -
హైదరాబాద్‌కు దీపికా పదుకొణె.. ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కోసం !
Deepika Padukone Begins Shooting For Prabhas New Movie: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అందుకోసం అనేక ప్రయాణాలు చేస్తుంటుంది. తాజాగా డిసెంబర్ 4న దీపికా హైదరాబాద్‌కు వెళ్తుండగా ముంబై విమానాశ్రయంలో తళుక్కుమంది. ఈ ప్రయాణం తన రాబోయే సినిమా షూటింగ్ కోసమే అని తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ కె' (Project K) అని పలు నివేదికలు తెలిపాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని సమాచారం. దీపికా తెల్లటి క్రాప్ టాప్‌తో లైలాక్ ప్యాంట్ సూట్ ధరించి, చిరునవ్వుతో పలకరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ 'ప్రాజెక్ట్ కె' చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఉండనుంది. ఈ సినిమాతో దీపికా పదుకొణె టాలీవుడ్లో అరంగ్రేటం చేయనుంది. అయితే ఈ చిత్రానికి తాత్కాలికంగా ప్రాజెక్ట్ కె అని పేరు పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుంది. ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ బృందానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా డానీ శాంచెజ్ లోపెజ్ చేయగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్ బచ్చన్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో బిగ్ బి పాత్ర గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ 'బచ్చన్ సర్ మా సినిమాలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర. ఆ పాత్రకు ఆయన తప్పకుండా న్యాయం చేస్తారని నమ్ముతున్నాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Singeetham Srinivasarao Birthday Special:అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు
-
అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు
సాక్షి, హైదరాబాద్: తొంభై వసంతాల నిత్యయవ్వనుడు సింగీతం శ్రీనివాసరావు. దశాబ్దాల తెలుగు సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ... -
లెజెండరీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ఫేస్బుక్ వీడియో ద్వారా అభిమానులకు తెలియజేశారు. కోవిడ్-19 లక్షణాలతో సెప్టెంబర్ 9న చెన్నైలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం(సెప్టెంబర్ 22) నాటితో ఆయన క్వారంటైన్ గడువు ముగుస్తుందని తెలిపారు. అయితే అంతకు ముందు రోజే ఆయన పుట్టినరోజు కావడం విశేషం. తనకు కరోనా సోకిన విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. 65 ఏళ్లుగా నేను పాజిటివ్‌గా ఉన్నా, కానీ డాక్టర్లు ఇప్పుడు కొత్తగా కోవిడ్ పాజిటివ్ అన్నారంటూ సరదాగా మాట్లాడారు. హోమ్ ఐసోలేషన్‌లో భాగంగా ప్రత్యేక గదిలో ఉన్నానని, ఇది తనకు హాస్టల్ రోజులను గుర్తు చేస్తోందంటూ చమత్కరించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఆ వైరస్ తనకు సోకిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా సింగీతం శ్రీనివాసరావు ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’, 'ఆదిత్య369' వంటి పలు హిట్ చిత్రాలకుదర్శకత్వం వహించారు. చివరిసారిగా 2005లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన" ముంబై ఎక్స్‌ప్రెస్" చిత్రానికి డైరెక్టర్‌గా పని చేశారు. (చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!) -
ఆయన నా మనసుకి అంత దగ్గర..
రావి కొండలరావుతో నాది దాదాపు 60 ఏళ్ల పరిచయం. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడే ఆయన తెలుసు. కొండలరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఆ రోజుల్లోనే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. నాటకాల్లో నటించడమే కాకుండా రచనలు కూడా చేసేవారు. కొండలరావుగారు, ఆయన భార్య రాధాకుమారి.. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంటికి వాళ్లు రావటం, వాళ్లింటికి మేం వెళ్లటం జరుగుతూ ఉండేది. నేను దర్శకుడైన తర్వాత దాదాపు ప్రతి సినిమాలోను ఆయన ఉన్నాడు. నా సినిమాల్లో ఆయన లేని సినిమా లేదు. ఆయన నా మనసుకి అంత దగ్గరివాడు. విజయావారి ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన సంపాదకునిగా చేసినప్పుడు కొన్ని ఆర్టికల్స్ రాసే విషయంలో నన్ను సంప్రదించేవారు. (పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి) షూటింగ్‌లు ఉన్నప్పుడు రోజూ కలిసేవాళ్లం. లేకపోయినా కూడా విజయా స్టూడియోలో వారం వారం తప్పనిసరిగా కలిసేవాళ్లం. విజయా వాళ్లు మళ్లీ సినిమాలు తీస్తారు అనుకున్నప్పుడు కూడా ఆయనతో ‘బృందావనం’, ‘భైరవద్వీపం’ చిత్రాలకు కలిసి పని చేశాం. నటన విషయం పక్కన పెడితే మనిషిగా ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్ప మనిషంటే ఏదైనా విమర్శించాల్సి వచ్చినా సెన్సాఫ్ హ్యూమర్‌తో విమర్శించేవాడే కానీ, ఎవరినీ నొప్పించేవాడు కాదు. అది ఎంతో గొప్ప గుణం. అది అందరిలో ఉండదు. అతనికి వ్యక్తిగతంగా ఒక్క శత్రువు కూడా లేరంటే అందరూ నమ్మాల్సిందే. సినిమా పరిశ్రమలో అందరికీ పాలిటిక్స్ ఉంటాయి కానీ, ఆయనకు ఏ రాజకీయాలూ తెలియవు. అంత గొప్ప మనిషి. సినిమా పరిశ్రమ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయింది. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధకు గురి చేస్తోంది. -
శిష్యుడి కోసం...
విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వీయన్ ఆదిత్య దర్శకుడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొయినాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కి చిత్రదర్శకుడు వి.యన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు çసతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సింగీతంగారు దర్శకత్వం వహించిన ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అప్పట్లో 4 ఏళ్ల పాటు వాళ్లింట్లో భోజనం చేసి పెరిగాను. ఆయన మా షూటింగ్‌కి వచ్చి ఓ సన్నివేశానికి డైరెక్ట్ చేయటం, ఆయన అసిస్టెంట్‌గా ఆ సన్నివేశానికి నేను క్లాప్నివ్వటం.. చెన్నై వాహిని స్టూడియోలో నేను క్లాప్ కొట్టిన అనుభూతి మరలా పునరావృతమైంది’’ అన్నారు. నిర్మాత అర్జున్ మాట్లాడుతూ– ‘‘88 ఏళ్ల వయసులో సింగీతంగారి ఎనర్జీ చూసి ఆశ్యర్యపోయాము. ఎన్నో పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు మా సినిమా షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు. -
సింగీతానికి సాలూరి ప్రతిభా పురస్కారం
రసమయి సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రతీ సంవత్సరం ప్రధానం చేసే డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు ప్రతిభా పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారిని ఎంపిక చేశారు. సంగీత దర్శకులుగా తెలుగు సినీ రంగానికి సేవలందించిన సాలూరి రాజేశ్వరరావు రఘపతి వెంకయ్య అవార్డు, కళైమామని, సంగీత సామ్రాట్‌గా సినీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులు. ఆయన పేరున ఈ సంవత్సరం 18వ పురస్కారంగా సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ నెల 10 తేదీ సాయంత్ర 5.30 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో ప్రధానం చేయడం జరుగుతుందని అదే సందర్భంలో రసమయి ప్రేరణతో సాలూరి రాజేశ్వరరావుగారిపై భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ రూపొందించిన సాలూరి రాజేశ్వరరావు ప్రత్యేక తపాల చంద్రిక (సాలూరి స్పెషల్ పోస్టల్ కవర్) ఆవిష్కరణ జరుగుతుందని రసమయి అధ్యక్ష్యులు ఎంకె రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో జంట నగరాల్లోని సుప్రిసిద్ధ గాయని గాయకులు సాలూరి రాజేశ్వరరావుగా రు స్వరపరచిన గీతాలను ఆలపిస్తారని తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా కె. రోశయ్య, సభాధ్యక్షులుగా శ్రీ రుద్రరాజు పద్మరాజు,. సాలూరి తపాలా చంద్రిక ఆవిష్కర్తగా బ్రిగేడియర్ చంద్రశేఖర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరి కోఠి, సాలూరి వాసూరావు, సాలూరి పూర్ణచంద్రరావు, మాధవ పెద్ది సురేష్ పాల్గొంటారని తెలిపారు. -
నాడు కమల్ హాసన్.. నేడు షారుక్ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘జీరో’ తొలి టీజర్ విడుదలైన విషయం తెల్సిందే. వచ్చే డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో ఎలా నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సరిగ్గా 29 ఏళ్ల క్రితం కమలా హాసన్ నటించిన ‘అపూర్వ సహోదరులు’ చిత్రాన్ని తమిళ, తెలుగుభాషల్లో విడుదల చేయగా కలెక్షన్లు హోరెత్తాయి. తమిళనాట అప్పటి వరకు నెలకొన్న అన్ని రికార్డులను ఆ సినిమా బద్ధలు కొట్టింది. ఆ తర్వాత ఆ సినిమా రికార్డును అధిగమించినది రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రం మాత్రమే. అపూర్వ సహోదరులు అంతటి ఆదరణ పొందడానికి కారణం ‘అప్పు’ పాత్రలో కమల్ హాసన్ మరుగుజ్జుగా కనిపించడమే. మోకాళ్ల వరకే పూర్తి కాలున్నట్లుగా కమల్ హాసన్ ఆ చిత్రంలో కనించడానికి కమలహాసన్‌తోపాటు దర్శకుడు ఎంతో కష్టపడ్డారు. అది ఎలా సాధ్యమైందన్న విషయాన్ని కమలా హాసన్గానీ, ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావుగానీ వెల్లడించకుండా 2008 సంవత్సరం వరకు గోప్యంగా ఉంచారు. ఈ రహస్యం ఇప్పటి కూడా అందరికి తెలియకపోవచ్చు. ఆ చిత్రంలో మరుగుజ్జు పాత్ర కోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నిగానీ, గ్రాఫిక్స్గానీ ఉపయోగించలేదు. సింగీతం శ్రీనివాస్ రావు కథనం ప్రకారం. కమల్ హాసన్ ఎక్కువ వరకు వెనక కాళ్లు కనిపించకుండా మోకాళ్లపై నడిచారు. అందుకనే ఎక్కువ షాట్లు క్లోజప్లోనే ఉంటాయి. ఇక కమల్ హాసన్ పక్కకు తిరిగి నడుస్తున్నట్లుగా చూపించాల్సి వచ్చినప్పుడు కందకం తవ్వి అందులో మోకాలి వరకు కమల్‌ను నిలబెట్టి ఇసుకతో పూడ్చి నడిపించారు. మోకాళ్లపై నడుస్తున్నప్పుడు ఎక్కువ వరకు సహజంగా కనిపించేందుకు, మోకాలి చిప్ప నొప్పి పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను వాడారు. ఇక తోటి నటుల మధ్య ఎదురుగా కాకుండా అటూ ఇటూగా ఉన్నప్పుడు కూడా కందకం టెక్నిక్‌నే వాడారు. పాటల సందర్భంలో, ముఖ్యంగా సర్కస్ మిత్రులతో కలిసి కాళ్లూపుతూ పాటలు పాడినప్పుడు కమల్ ప్రత్యేకంగా రూపొందించిన కత్రిమ కాళ్లను వాడారు. ఆ కాళ్లను వంచిన మోకాళ్లకు తగిలించి కదిలేలా చేశారు. అప్పు పాత్రలో కమల్ హాసన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోకాళ్ల వరకు కాళ్లను కత్తిరించినట్లు కనిపిస్తుంది తప్పా, పూర్తి సహజత్వం కనిపించదు. అయినప్పటికీ ఆ ప్రయోగం నచ్చడంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత 2001లో విడుదలైన ఆషిక్ సినిమాలో జానీ లివర్ ఇలాంటి టెక్నిక్కే ఉపయోగించి మరుగుజ్జు పాత్రలో నటించారు. ఇక 2006లో విడుదలైన ‘జాన్ ఏ మన్’ చిత్రంలో అనుపమ్ ఖేర్ మరుగుజ్జు పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆయన మోకాళ్ల వరకు కాళ్లు మడిచే నడిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్లో పాల్గొనడం వల్ల ఆయన మోకాలి చిప్పలు అప్పట్లో వాచి పోయాయి. ఇప్పుడు కూడా మెట్లు ఎక్కుతుంటే మోకాలి చిప్పలు కలుక్కుమంటున్నాయని అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇప్పుడు ‘జీరో’ చిత్రంలో షారూక్ ఖాన్ మరుగుజ్జుగా ఎలా నటిస్తున్నారన్నది ఆసక్తికరమైన తాజా ప్రశ్న. కమల్ హాసన్, అనుపమ్ ఖేర్లలాగా మోకాలి చిప్పలను దెబ్బతీసుకోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి షారుక్ ఖాన్ నటించారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హాబిట్’ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన పీటర్ జాక్సన్ ‘పర్స్పెక్టివ్ టెక్నిక్’ను ఇందులో ఉపయోగించారు. దీనికి విస్తతమైన సెట్లు అవసరం అవుతాయి. తోటి పాత్రలకన్నా షారుక్ ఖాన్‌ను చాలా దూరంగా ఉంచి షూటింగ్ చేయడం వల్ల షారుక్ ఖాన్ పొట్టిగా కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రల మధ్య ఆ దూరం కనిపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగిస్తారు. ఇందులో కూడా కెమేరా పనితనం బాగా లేకపోయినా, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మిక్సింగ్ బాగాలేకున్నా, సినిమా మొత్తం నిడివిలో ఒకేతీరు పర్స్పెక్టివ్ లేకున్నా సహజత్వం లోపిస్తుంది. -
'ఆదిత్య 369'కు సీక్వెల్
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 81 ఏళ్ల వయసులో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇందులో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో కూడా టైమ్ మిషనే కథాంశమయినా స్ర్కీన్ ప్లే విభిన్నంగా ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణతో త్వరలో చర్చించనున్నట్టు చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన 'వెలకమ్ ఒబామా' సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.