Deepika Padukone Spotted At Mumbai Airport: ప్రభాస్‌ కొత్త సినిమా షూటింగ్‌ కోసం ! - Sakshi
Sakshi News home page

Deepika Padukone: హైదరాబాద్‌కు దీపికా పదుకొణె.. ప్రభాస్‌ కొత్త సినిమా షూటింగ్‌ కోసం !

Published Sat, Dec 4 2021 12:31 PM | Last Updated on Sat, Dec 4 2021 1:05 PM

Deepika Padukone Begins Shooting For Prabhas New Movie - Sakshi

Deepika Padukone Begins Shooting For Prabhas New Movie: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అందుకోసం అనేక ప్రయాణాలు చేస్తుంటుంది. తాజాగా డిసెంబర్‌ 4న దీపికా హైదరాబాద్‌కు వెళ్తుండగా ముంబై విమానాశ్రయంలో తళుక్కుమంది. ఈ ప్రయాణం తన రాబోయే సినిమా షూటింగ్‌ కోసమే అని తెలుస్తోంది. ఆ సినిమా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్‌ కె' (Project K) అని పలు నివేదికలు తెలిపాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నారని సమాచారం. దీపికా తెల్లటి క్రాప్‌ టాప్‌తో లైలాక్ ప్యాంట్‌ సూట్‌ ధరించి, చిరునవ్వుతో పలకరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. 

ఈ 'ప్రాజెక్ట్‌ కె' చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఉండనుంది. ఈ సినిమాతో దీపికా పదుకొణె టాలీవుడ్‌లో అరంగ్రేటం చేయనుంది. అయితే ఈ చిత్రానికి తాత‍్కాలికంగా ప్రాజెక్ట్‌ కె అని పేరు పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. వైజయంతీ మూవీస్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక‍్కించనుంది. ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ బృందానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా డానీ శాంచెజ్ లోపెజ్ చేయగా, మిక్కీ జె మేయర్‌ సంగీతం అందించనున్నారు. 

ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్‌ బచ్చన్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో బిగ్‌ బి పాత్ర గురించి నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ 'బచ్చన్‌ సర్‌ మా సినిమాలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర. ఆ పాత్రకు ఆయన తప్పకుండా న్యాయం చేస్తారని నమ్ముతున్నాను.' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement