Tollywood Director Nag Ashwin Seeking From Anand Mahindra Help For Prabhas Movie - Sakshi
Sakshi News home page

Anand Mahindra-Nag Ashwin: ఆనంద్‌ మహీంద్రాని సాయం కోరిన టాలీవుడ్‌ క్రేజీ డైరెక్టర్‌

Published Fri, Mar 4 2022 2:25 PM | Last Updated on Sat, Mar 5 2022 2:38 PM

Tollywood Director Nag Ashwin Seeking Anand Mahindra Help For His film With Prabhas and Deepika - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ టాలెండెడ్‌ డైరెక్టర్లలో ఒకరైన నాగ్‌ అశ్విన్‌ ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రాని సాయం కోరడం సంచలనంగా మారింది. బిగ్‌బి అమితాబ్‌, డార్లింగ్‌ ప్రభాస్‌, దీపికా పడుకోన్‌లు ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే కోసం నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్‌ ద్వారా ఆనంద్‌ మహీంద్రాని సంప్రదించారు. 

ప్రాజెక్ట్‌ కే సైన్స్‌ ఫిక‌్షన్‌ జానర్‌ సినిమా కావడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని మించిన వాహనాలను ఈ సినిమాలో ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలు పూర్తిగా ఇండియన్‌ ఇంజనీర్లు, డిజైనర్లతోనే తయారు చేయిస్తు‍న్నారు. ఫిక‌్షన్‌ సినిమా ఐనప్పటికీ రియల్టీకి దగ్గరగా వాహనాల డిజైన్‌ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకి సంబంధించి మీ హెల్ప్‌ కావాలంటూ ఆనంద్‌ మహీంద్రాని నాగ్‌ అశ్విన్‌ కోరారు.

విద్యార్థిగా తనకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్‌ ఉండేదని పలుమార్లు ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. హ్యాండీక్యామ్‌ తీసుకుని డాక్యుమెంటరీలు తీసే ప్రయత్నం కూడా చేసినట్టు గతంలో ఫోటోలు షేర్‌ చేశారు. కాగా ఏకంగా సినిమా నిర్మాణంలో ఇండస్ట్రియలిస్టుగా మీ సాయం కావాలంటూ మహానటి దర్శకుడి నుంచి పిలుపు వచ్చింది. 

నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌కి ఆనంద్‌ మహీంద్రా స్పందించారు... ఇలాంటి ఆఫర్‌ని ఎందుకు కాదనుకుంటాను. మీకు సాయం చేయడానికి మహీంద్రా గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మహీంద్రాని సాయంగా పంపుతానంటూ బదులిచ్చారు.

చదవండి: Anand Mahindra: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement