Project K: Nag Ashwin Entered Into Mahindra Research Valley For Prabhas Upcoming Movie - Sakshi
Sakshi News home page

Mahindra-Nag Ashwin: మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలో ప్రాజెక్ట్‌ కే పనులు

Published Mon, Mar 14 2022 12:01 PM | Last Updated on Mon, Mar 14 2022 12:37 PM

Nag Ashwin Entered Into Mahindra Research Valley For Prabhas Upcoming Movie Project K - Sakshi

ఆనంద్‌ మహీంద్రా మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అంటున్నారు నెటిజన్లు. దాన్ని మరోసారి నిజం చేసి చూపించారీ పారిశ్రామిక దిగ్గజం. మాట ఇచ్చిన పది రోజుల్లోనే దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చారు. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సైన్స్‌ ఫిక‌్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ అడ్వెంచర్‌ మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్‌కే గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో ఫ్యూచర్‌కి సంబంధించిన ఆల్ట్రామోడర్న్‌ కార్లను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ కేలో ఉపయోగించబోయే కార్ల తయారీకి సంబంధించి మీ హెల్ప్‌ కావాలంటూ నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్‌ ద్వారా ఆనంద్‌ మహీంద్రాని కోరారు. అశ్విన్‌ రిక్వెస్ట్‌కి ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ .. ఇలాంటి అవకాశం ఎందుకు వదులుకుంటాను. మహీంద్రా గ్రూప్‌కి చెందిన గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మీకు సాయం చేస్తాడంటూ బదులిచ్చారు.

ఆనంద్‌ మహీంద్రా, నాగ్‌ అశ్విన్‌ల మధ్య మార్చి 4న ఆ సంభాషణ ట్విట్టర్‌లో జరిగింది. సరిగ్గా పది రోజులు గడిచాయో లేదో.. మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలోకి ఎంటరయ్యారు నాగ్‌ అశ్విన్‌. రీసెర్చ్‌ టీమ్‌కి సంబంధించి ప్రఖ్యాత ఇంజనీరు వేలు దగ్గరుండి నాగ్‌ అశ్విన్‌ను అక్కడికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని నాగ్‌ అశ్విన్‌ ట్విట్టర్‌లో తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement