Project K Movie: Anand Mahindra Praises Director Nag Ashwin Deets Inside - Sakshi
Sakshi News home page

Project K Movie: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

Published Mon, Mar 14 2022 1:15 PM | Last Updated on Mon, Mar 14 2022 1:48 PM

Anand Mahindra Praises Director Nag Ashwin Over Project K Movie - Sakshi

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌ ఉండే ఆనంద్‌ మహింద్రా తన తాజా ట్వీట్‌ నాగ్‌ అశ్విన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక‌్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాగ్‌ అశ్విన్‌ పాన్‌ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్‌ కే అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చారు.

చదవండి: పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్‌ హీరోయిన్‌ క్లారిటీ

ఈ నేపథ్యంలో ఈ మూవీలో ఉపయోగించబోయే కార్ల తయారీకి సంబంధించి మీ హెల్ప్‌ కావాలని కోరుతూ నాగ్‌ అశ్విన్‌ ఇటీవల ఆనంద్‌ మహింద్రాకు ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనికి స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. ‘ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొకుండా ఉంటానా? మహీంద్రా గ్రూప్‌కి చెందిన గ్లోబల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ వేలు మీకు సాయం చేస్తారు’ అంటూ ప్రాజెక్ట్‌ కే కోసం తన టీంను పరిచయం చేశారు ఆయన. ఇటీవల ఆనంద్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించిన నాగ్‌ అశ్విన్‌.. అక్కడి వాతావరణానికి ఫిదా అయ్యాడు.

చదవండి: బాహుబలి-3 ఉంటుంది, వర్క్‌ చేస్తున్నాం : రాజమౌళి

దీంతో ‘ఆనంద్ మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ అద్భుతంగా ఉంది. ప్రకృతితో మమేకమై, ఆహ్లదాన్ని ఇస్తోంది. మహీంద్ర సార్‌, అతని బృందంతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ మహీంద్రా సర్‏కు థ్యాంక్స్’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు స్పందించిన మహింద్రా.. ‘నాగ్ అశ్విన్, మీరు రూపొందిస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సైన్స్ ఫిక్షన్ సినిమా గురించి మీరు నన్ను ఎంతగానో మోటివేట్ చేశారు. మీరు ఈ సినిమాతో హాలీవుడ్‌ను ఢీ కొట్టబోతున్నారని నాకు నమ్మకం ఉంది’ అంటూ బదులిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement