Prabhas Project k: Nag Aswin Confirms Release Date Details Inside Project k: Nag Aswin Confirms Release Date - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె: ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ రివీల్‌ చేసిన డైరెక్టర్‌

Published Tue, Jan 11 2022 7:50 AM | Last Updated on Tue, Jan 11 2022 10:19 AM

Project k: Nag Aswin Confirms Release Date - Sakshi

‘ప్రాజెక్ట్‌ కె’ ఎలా ఉంటుందో చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో కనిపించనుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చిత్రనిర్మాత అశ్వనీదత్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

‘‘ప్రాజెక్ట్‌ కె’కు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ షెడ్యూల్‌లో అమితాబ్, దీపికా పాల్గొనే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు అశ్వనీదత్‌. ఇక ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ ఈ నెల 14న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘స్పిరిట్‌’ చిత్రాలు ప్రభాస్‌ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement