Director Singeetam Srinivasa Rao Wife Lakshmi Kalyani Passed Away - Sakshi
Sakshi News home page

Singeetham Srinivasa Rao: లెజండరీ డైరెక్టర్‌ సింగీతం ఇంట విషాదం

Published Sun, May 29 2022 8:22 AM | Last Updated on Sun, May 29 2022 10:38 AM

Legendary Director Singeetham Srinivasa Rao Wife Lakshmi Kalyani Passes Away - Sakshi

లెజండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’అని సింగీతం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.


భార్య లక్ష్మీ కల్యాణితో సింగీతం

1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది.సింగీతం సీనీ కెరీర్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు. సినిమా స్క్రిప్ట్‌ రాయడంలో ఆయనకు సహాయం చేసేశారు. లక్ష్మీ కల్యాణి గురించి ఆయన ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభాస్‌ నటించబోతున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కే’మూవీకి తొలుత  కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత  అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement