శిష్యుడి కోసం... | Valliddari Madhya Movie Shooting in final stages | Sakshi
Sakshi News home page

శిష్యుడి కోసం...

Published Tue, Nov 26 2019 6:10 AM | Last Updated on Tue, Nov 26 2019 6:10 AM

Valliddari Madhya Movie Shooting in final stages - Sakshi

లొకేషన్‌లో సింగీతం శ్రీనివాసరావు, ఆయన సతీమణితో వీఎన్‌ ఆదిత్య

విరాజ్‌ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’. వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌  పతాకంపై అర్జున్‌ దాస్యం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వీయన్‌ ఆదిత్య దర్శకుడు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొయినాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కి  చిత్రదర్శకుడు వి.యన్‌. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు çసతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సింగీతంగారు  దర్శకత్వం వహించిన ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను.

అప్పట్లో 4 ఏళ్ల పాటు వాళ్లింట్లో భోజనం చేసి పెరిగాను. ఆయన మా షూటింగ్‌కి వచ్చి ఓ సన్నివేశానికి డైరెక్ట్‌ చేయటం, ఆయన అసిస్టెంట్‌గా ఆ సన్నివేశానికి నేను క్లాప్‌నివ్వటం.. చెన్నై వాహిని స్టూడియోలో నేను క్లాప్‌ కొట్టిన అనుభూతి మరలా పునరావృతమైంది’’ అన్నారు. నిర్మాత అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘88 ఏళ్ల వయసులో సింగీతంగారి ఎనర్జీ చూసి ఆశ్యర్యపోయాము. ఎన్నో పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు మా సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్‌ మీడియా అధినేత విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వివేక్‌ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement