దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 81 ఏళ్ల వయసులో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇందులో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో కూడా టైమ్ మిషనే కథాంశమయినా స్ర్కీన్ ప్లే విభిన్నంగా ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణతో త్వరలో చర్చించనున్నట్టు చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన 'వెలకమ్ ఒబామా' సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.
'ఆదిత్య 369'కు సీక్వెల్
Published Thu, Sep 19 2013 4:37 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement