మిస్సమ్మ స్ఫూర్తితో... | Inspired by Missamma | Sakshi
Sakshi News home page

మిస్సమ్మ స్ఫూర్తితో...

Published Fri, Feb 5 2016 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

మిస్సమ్మ స్ఫూర్తితో...

మిస్సమ్మ స్ఫూర్తితో...

రచయితలు దర్శకులుగా మారడం ఇటీవల టాలీవుడ్‌లో ఎక్కువగా నడుస్తోన్న  ట్రెండ్. ఈ కోవలోకి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి కథ అందించిన హుస్సేన్ షా కిరణ్ చేరారు. ఆయన దర్శకత్వంలో ‘మీకు మీరే..మాకు మేమే’ అనే చిత్రం రూపొందింది. తరుణ్ శెట్టి, అవంతిక, కిరీటీ దామరాజు, జెన్నీ, భరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అలనాటి క్లాసిక్  ‘మిస్సమ్మ’లో ఓ సీన్‌ని చూసి, స్ఫూర్తి పొంది ఈ చిత్రం చేశాం.

ఆ చిత్రానికి గౌరవం ఇస్తూ అందులోని బిట్ సాంగ్  లిరిక్‌ని ‘మీకు మీరే.. మాకు మేమే’ అని పేరు పెట్టాం. అల్లు అరవింద్‌గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్‌తోనే సుకుమార్‌గారిని కలిసి ‘నాన్నకు ప్రేమతో’ కథ ఇచ్చాను’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కార్తీక్ వంశీ తాడేపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement