హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ‘మిస్సమ్మ’ | Missamma Movie Shooting Starts With Minister Srinivas Yadav | Sakshi
Sakshi News home page

Missamma : హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ‘మిస్సమ్మ’

Published Sat, Nov 20 2021 6:46 PM | Last Updated on Sat, Nov 20 2021 6:46 PM

Missamma Movie Shooting Starts With Minister Srinivas Yadav - Sakshi

సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచర్, లైవ్లీ అండ్ లవ్లీ బిహేవియర్ తో అలనాటి మిస్సమ్మ ఆల్ టైం క్లాసిక్‌గా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకుని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న చిత్రం మిస్సమ్మ. శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ హరి ఐనీడి, రమ్య కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అభిరాజ్ రుపాల, సతీష్ వీ.ఎమ్‌ అనే ఇద్దరు కొత్త డైరెక్టర్స్ మిస్సమ్మ అనే చిత్రంతో పరిచయం అవుతున్నారు. మిస్సమ్మ చిత్ర ప్రారంభోత్సవానికి  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చి  హీరో హీరోయిన్ల ఫై క్లాప్ కొట్టి ఘనంగా ప్రారంభించారు. 


ఈ సందర్భంగా మంత్రి తలసాని టీం అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తలసాని. ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మిస్సమ్మ హిట్ కావాలని ఆయన కోరుకున్నారు. తన సన్నిహితుడు హరి అయినీడి సినిమా పరిశ్రమలో చాలా కష్టపడ్డాడు, పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశారు, ఫ్యాషన్ ఉన్న నిర్మాత, మంచి వ్యక్తి. అలాంటి హరి అయినీడి కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని తలసాని అభిలషించారు.

సైంటిఫిక్, హిస్టారిక్ అంశాలతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్‌గా  మిసమ్మ తెరకెక్కబోతున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట . బ్రిటీషర్స్ రాక ముందు ఇండియన్ హిస్టరీ నుంచీ, బ్రిటిషర్స్ రిజైమ్ నుంచీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుని, ఆ విషయాలను ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశామని  దర్శకులు తెలిపారు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. 

 బిగ్ బాస్ లహరి మాట్లాడుతూ .. మిస్సమ్మ సినిమాలో నేను కూడా చెయ్యటం చాలా ఆనందం గా వుంది అన్నారు.

 హీరోయిన్ శోభిత రానా మారట్లాడుతూ.. ఇంత మంచి ప్రాజెక్టు లో నేను చెయ్యటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకమైనది. నాకు మరియు చిత్ర యూనిట్ కు మంచి పేరు తెచ్చే సినిమా ఇది అన్నారు. 

 హీరో అర్జున్ కృష్ణ మాట్లాడుతూ .. నాకు నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చే సినిమా మిస్సమ్మ అవుతుంది. ఈ సినిమా తరువాత హీరోగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను రుణపడి వుంటాను అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement