నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి
పల్లవి : ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరీ (2)
చరణం : 1
మనసులోని మమతలన్నీ
కనుల ముందు నిలచినటుల ॥
వన్నెలతో చిన్నెలతో మనసుగొనిన ఊహాసుందరి ॥నా చెలి॥
చరణం : 2
కలువ కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి
వినయసహన శోభలతో తనివినించు సుగుణసుందరి ॥నా చెలి॥
పల్లవి :
ఏమి శిక్ష కావాలో కోరుకొనవె ప్రేయసీ
కోరుకొనవె ప్రేయసీ...॥ మురిపెముగా ముచ్చటగా ముద్దుముద్దుగా (2) ॥
చరణం : 1
ఆశలేవో తెలుసుకొని వేసమలా వేసుకొని (2)
ముసిముసి నవ్వులతో నా ముందు నిలచినందులకు
చరణం : 2
ఆవరించు చీకటిలో... ఓ...
ఆవరించు చీకటిలో దారిచూపు దీపికవై
దారిచూపు దీపికవై...
జీవితమును నవశోభల వెలయజేసినందులకు
చిత్రం : చంద్రహారం (1954)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం, గానం : ఘంటసాల