
చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన నేడు మరణించారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఘంటసాల, సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు డబ్బింగ్ చెప్పి రత్నకుమార్ రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళ, మలయాళ సహా వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్‌కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు.
చదవండి : ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు!
'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు'