
సీనియర్ నటుడు శరత్‌బాబు మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు.చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు
నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన చివరగా నరేష్-పవిత్రా లోకేష్‌ల మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనరోగ్యంతో ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీలో చేరిన శరత్‌బాబు మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
నేడు అంత్యక్రియలు
శరత్‌బాబు తోడబుట్టినవాళ్లల్లో అన్నయ్య ఉమా దీక్షితులు, తమ్ముళ్లు గోపాల్, గోవింద్, సంతోష్, మధు, మంజు ఉన్నారు. శరత్‌బాబు రెండో అన్నయ్య రమా దీక్షితులు మూడేళ్ల కిందట మృతి చెందారు. అక్కచెల్లెళ్లు సిరి, రాణి, బేబీ, మున్ని, రోజా ఉన్నారు.
శరత్‌బాబు మృతికి రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సోమవారం సాయంత్రం 2 గంటల పాటు హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం శరత్‌బాబు భౌతికకాయాన్ని ఉంచి, ఆ తర్వాత చెన్నై తరలించారు. చెన్నైలో నేడు శరత్‌బాబు అంత్యక్రియలు జరుగుతాయి.అయితే ఆయనకు పిల్లలు లేకపోవడంతో తలకొరివి ఎవరు పెడతారన్నది సందేహంగా మారింది.చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్' నటుడు స్టీవెన్ సన్ మృతికి కారణమిదే!