చెన్నైకి గేమ్‌ | Sakshi
Sakshi News home page

చెన్నైకి గేమ్‌

Published Tue, Apr 30 2024 12:04 AM

Ram Charan and Kiara Advani starrer Game Changer wraps key schedule: next shoot in Chennai

చెన్నైలో ఆట మొదలెట్టనున్నారు హీరో రామ్‌చరణ్‌. ఆయన హీరోగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్‌ చేంజర్‌’లో జోడీగా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్‌ చెన్నైలోప్రారంభం కానుందని సమాచారం. 

మే మొదటి వారంలో చెన్నైలోప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, కియారా అద్వానీ, సునీల్, నవీన్‌ చంద్రలపై ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట శంకర్‌. కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్‌  సీన్స్‌ తెరకెక్కిస్తారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement