SS Rajamouli Share Sneak-Peek Of His Temple Tour Across Tamil Nadu With His Family, Watch Video - Sakshi
Sakshi News home page

Rajamouli: వారి అద్భుతమైన ఆలోచనలు కట్టిపడేశాయి: రాజమౌళి

Published Tue, Jul 11 2023 6:36 PM | Last Updated on Tue, Jul 11 2023 6:53 PM

Rajamouli Shares Tamilnadu Temple Tour With Family - Sakshi

ఆర్ఆర్‌ఆర్ సినిమాతో టాలీవుడ్‌ను ప్రపంచానికి పరిచయం దర్శకధీరుడు రాజమౌళి. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ ఏకంగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. అయితే ఈ చిత్రానికి సీక్సెల్ కూడా ఉంటుందని ఇటీవలే ప్రకటించారు కూడా. దీనికి సంబంధించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

(ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?)

కానీ అంతకుముందే ప్రిన్స్ మహేశ్‌బాబుతో రాజమౌళి ఓ చిత్రం చేయనున్నారు. గతంలోనే రాజమౌళి, మహేశ్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది గ్లోబ్ ట్రొటింగ్ సినిమా అని అన్నారు. అడ్వెంచరస్ తరహా స్టోరీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇండియానా జోన్స్ తరహా జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. 

అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు దర్శకధీరుడు. తన కుటుంబంతో కలిసి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను చుట్టేసినట్లు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జూన్ నెల చివరివారంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 

ట్వీట్‌లో రాస్తూ.. 'చాలా కాలంగా తమిళనాడులో రోడ్ ట్రిప్ వెళ్లాలనుకున్నా. దేవాలయాలను సందర్శించాలనుకున్న నా కుమార్తె ఆలోచనకు ధన్యవాదాలు. మేము జూన్ చివరి వారంలో శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి, మదురైకి వెళ్లాం.  అద్భుతమైన వాస్తుశిల్పం, ఇంజనీరింగ్, పాండ్యాలు, చోజాస్ నాయకర్లు, అనేక ఇతర పాలకుల లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా నన్ను మంత్రముగ్ధులను చేశాయి. అంతే కాకుండా మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేసినా.. రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేసినా.. ఎక్కడైనా భోజనం అద్భుతంగా అనిపించింది. నేను వారంలోనే 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం తర్వాత.. ఈ హోమ్ ల్యాండ్ టూర్ రిఫ్రెష్‌గా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement