పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ‘ఘంటావధాని’గా బిరుదు పొందిన విశాఖ వాస్తవ్యులు, డా. సయ్యద్ రహమతుల్లా గారి గానావధానం కార్యక్రమం అంతర్జాల వేదికపై 14 దేశాల ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది.
ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఘంటసాల శతజయంతి సంవత్సరంగా 366 రోజులపాటు నిర్వహింపబడుతున్న నిర్వహింపబడుతున్న “ఘంటసాల స్వర రాగ మహా యాగం” కార్యక్రమంలో భాగంగా 70వ రోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
డా. వంశీ రామరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల గారికి భారతరత్న పురస్కారంతో గౌరవించాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాకు ఘంటసాల పేరు పెట్టాలని సూచించారు. వంశీ సంస్థ తరఫున ఘంటసాల చదువుకున్న విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రతి సంవత్సరం, ఉత్తమ విద్యార్థికి స్కాలర్షిప్ అందించబోతున్నామని ప్రకటించారు.
14 దేశాల నుంచి సుమారు 20 మంది పృచ్ఛకులు పాల్గొని ఘంటసాల మాస్టారి పాటలపై, వారి జీవిత విశేషాలపై వివిధ కోణాలనుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి సభను రక్తి కట్టించారు. సమయోచితంగా అడిగిన ప్రతి ప్రశ్నకు వెంటనే సంపూర్ణమైన వివరణతో అవధాని సమాధానాలను అందించి అందరిని అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మండలి బుద్ధ ప్రసాద్, మాధవపెద్ది సురేష్, సాలూరి వాసూరావు, భువనచంద్ర వంటి ప్రముఖులు విచ్చేసి విచ్చేసి ప్రసంగించారు. నిర్వాహకులుగా అమెరికా నుంచి డా. వంగూరి చిట్టెన్ రాజు సింగపూర్ నుంచి కవుటూరు రత్న కుమార్ పాల్గొనగా, రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించారు.
పృచ్ఛకులుగా గోవర్ధన్ మల్లెల, న్యూజిలాండ్, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి, రమకంచిభొట్ల, ఆస్ట్రేలియా, రాధిక నోరి, అమెరికా, లక్ష్మి రాయవరపు, కెనడా సత్య మల్లుల, మలేషియా, సింగపూర్ నుంచి ఊలపల్లి భాస్కర్, గుంటూరు వెంకటేష్, సుబ్బు వి పాలకుర్తి, కాత్యాయని గణేశ్న, ఉసిరికల తాతాజీ, ఖతార్, డాక్టర్ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, ఉగాండా, విక్రమ్ కుమార్ పెట్లూరు, దక్షిణాఫ్రికా, వెంకప్ప భాగవతుల, ఖతార్, శ్రీమతి రాణి మాధవ్, ఒమాన్, డాక్టర్ వెంకటపతి తరిగోపుల, నార్వే, పీసపాటి జయ, హాంకాంగ్, రాజేష్ తోలేటి, యూ.కె, ఆర్ ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
చదవండి: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మెల్‌బోర్న్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ పెళ్లి
Comments
Please login to add a commentAdd a comment