గీత స్మరణం | song from the movie CID | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Fri, Aug 30 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి :


 అతడు: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
 తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే
 ఆమె: నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే
 తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే
 ॥
 
 చరణం : 1


 అ: నా హృదయమునే వీణజేసుకొని
        ప్రేమను గానము చేతువనీ      (2)
 నా గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవుననీ
 ఆ: నీకూ నాకూ వ్రాసి వున్నదని ఎపుడో తెలిసెనులే
 
 చరణం : 2


 ఆ: నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ (2)
 ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ
 అ: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
 ఆ: తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే
 ॥సరి॥
 
 పల్లవి :


 అతడు: నా మనసూ నీ మనసూ ఒకటై మనమొకటిగా
 ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో     (2)
 ఆమె: నా తనువూ నీ తనువూ వేరు వేరు వేరైనా
 పాలు నీరు కలియునటులె కలసిమెలసి పోదము     (2)
 
 చరణం : 1


 అ: నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా
 కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా     (2)
 ॥మనసూ॥
 
 చరణం : 2


 ఆ: నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా     (2)
 నీవంటే నీవనుచూ...
 నీవంటే నీవనుచూ కీచులాడుకొందమా
 ॥తనువూ॥
 
 చిత్రం: సి.ఐ.డి. (1965)
 రచన: పింగళి నాగేంద్రరావు
 సంగీతం: ఘంటసాల
 గానం: ఘంటసాల, పి.సుశీల

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement