బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్‌ 'సీఐడీ' మళ్లీ వస్తోంది! | Shivaji Satam, Daya Shetty Return with CID 2, Promo Release Date Out | Sakshi
Sakshi News home page

సీఐడీ 2 వచ్చేస్తోంది.. ప్రోమో ఎప్పుడంటే?

Published Thu, Oct 24 2024 8:09 PM | Last Updated on Thu, Oct 24 2024 8:19 PM

Shivaji Satam, Daya Shetty Return with CID 2, Promo Release Date Out

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో సీఐడీ. ఒళ్లు గగుర్పొడిచే నేరాలు, ఘోరాలు.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేసే సాహసాలు.. అన్నీ కూడా అద్భుతంగా ఉండేవి. అందుకే అందరూ సీఐడీని ఎంతో ఇష్టపడతారు. శివాజీ సతం, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్‌ శెట్టి, నరేంద్ర గుప్త, అన్ష సాయేద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టీవీ సిరీస్‌ ఆల్‌టైమ్‌ హిట్‌. 1998 నుంచి 2018 వరకు ఈ సిరీస్‌ కొనసాగింది.

తాజాగా సీఐడీ టీమ్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత మరోసారి అలరించేందుకు రెడీ అయ్యామని వెల్లడించింది. అక్టోబర్‌ 26న ప్రోమో రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. అయితే దివంగత నటుడు దినేశ్‌ ఫడ్నీస్‌ లేకుండా సీక్వెల్‌ చూడాల్సి వస్తుండటం కొంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కాగా సీఐడీలో ఫెడరిక్‌గా నటించిన దినేశ్‌ ఫడ్నీస్‌ గతేడాది డిసెంబర్‌లో కన్నుమూశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement