లవ్‌ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి | Woman Attack On Love Reddy Movie Actor NT Ramaswamy in Hyderabad | Sakshi
Sakshi News home page

లవ్‌ రెడ్డి నటుడిపై దాడి.. అందరిముందే గల్లా పట్టుకుని..

Published Thu, Oct 24 2024 6:19 PM | Last Updated on Thu, Oct 24 2024 6:53 PM

Woman Attack On Love Reddy Movie Actor NT Ramaswamy in Hyderabad

లవ్‌ రెడ్డి నటుడు ఎన్‌టీ రామస్వామిపై ఓ ప్రేక్షకురాలు దాడి చేసింది. థియేటర్స్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూద్దామని లవ్‌ రెడ్డి టీమ్‌ హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌ మల్టీప్లెక్స్‌కు గురువారం వెళ్లింది. ఈ మూవీ క్లైమాక్స్‌ చూసి ఎమోషనల్‌ అయిన ఓ ప్రేక్షకురాలు మూవీలో తండ్రి పాత్ర పోషించిన నటుడు రామస్వామి గల్లా పట్టుకుని కొట్టబోయింది. నిజంగానే అతడు ప్రేమజంటను విడదీశాడనుకుని కోపంతో నానా బూతులు తిట్టింది. 

షాక్‌లో లవ్‌ రెడ్డి టీమ్‌
ఈ ఘటనతో షాకైన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని నచ్చజెప్పారు. అది సినిమా అని, రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, సినిమాలో చూపించినట్లు అతడు చెడ్డవాడు కాదని మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఇకపోతే ఈ నెల 18న థియేటర్స్ లోకి వచ్చిన "లవ్ రెడ్డి" సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఎమోషనల్ ప్రేమకథగా ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement