Love Reddy Movie
-
అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న ‘లవ్‌రెడ్డి’
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’(Love Reddy Movie). యువ దర్శకుడు స్మరన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 18న థియేటర్స్‌లో రిలీజ్ అయి మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, అమెజాన్ ఫ్రైమ్ వీడియో( Amazon Prime Video)లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అమెజాన్ ప్రెమ్‌లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఈ చిత్రం నిలిచింది. తమ సినిమా ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో ద్వారా మరింతగా రీచ్ కావడం పట్ల మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లవ్ రెడ్డి కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి వచ్చేస్తోన్న 'లవ్ రెడ్డి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్ రెడ్డి'. ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా స్మరన్ రెడ్డి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా ఆహా వెల్లడించింది. లవ్ రెడ్డి అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి
లవ్ రెడ్డి నటుడు ఎన్టీ రామస్వామిపై ఓ ప్రేక్షకురాలు దాడి చేసింది. థియేటర్స్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూద్దామని లవ్ రెడ్డి టీమ్ హైదరాబాద్ నిజాంపేటలోని జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్‌కు గురువారం వెళ్లింది. ఈ మూవీ క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఓ ప్రేక్షకురాలు మూవీలో తండ్రి పాత్ర పోషించిన నటుడు రామస్వామి గల్లా పట్టుకుని కొట్టబోయింది. నిజంగానే అతడు ప్రేమజంటను విడదీశాడనుకుని కోపంతో నానా బూతులు తిట్టింది. షాక్‌లో లవ్ రెడ్డి టీమ్ఈ ఘటనతో షాకైన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని నచ్చజెప్పారు. అది సినిమా అని, రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, సినిమాలో చూపించినట్లు అతడు చెడ్డవాడు కాదని మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఇకపోతే ఈ నెల 18న థియేటర్స్ లోకి వచ్చిన "లవ్ రెడ్డి" సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎమోషనల్ ప్రేమకథగా ఆకట్టుకుంటోంది.చదవండి: బిగ్‌బాస్ 8: వెనకబడ్డ నిఖిల్.. విన్నింగ్ రేస్‌లో ప్రేరణ! -
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో లవ్ రెడ్డి మూవీ టీమ్ ఇంటర్వ్యూ
-
లవ్ రెడ్డి మూవీ టిమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
చిన్న సినిమాకు అండగా నిలిచిన ప్రభాస్
ఒక సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. దాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడం కూడా అంతే కష్టం. ఎంత మంచి సినిమా తీసినా సరే.. అది జనాల్లోకి తీసుకెళ్లకపోతే అంతే సంగతి. ఈ విషయంలో చిన్న సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అందుకే ప్రమోషన్స్ కోసం పెద్ద హీరోలను సంప్రదిస్తుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే అడిగిన వెంటనే తమవంతు సహాయం చేస్తుంటారు. వారిలో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా లవ్‌రెడ్డి అనే ఓ చిన్న చిత్రాన్ని ప్రొత్సహిస్తూ ఇన్‌స్టా వేదికగా తన మద్దతు ప్రకటించాడు.లవ్ రెడ్డి చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తన అభిమానుల కోసం లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి అండంగా నిలువాలని ప్రభాస్ కోరారు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి మద్దతు ఇవ్వగా ప్రభాస్ లాంటి అగ్ర హీరో లవ్ రెడ్డి చిత్రానికి అండగా నిలువడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రభాస్ లవ్ రెడ్డి చిత్రానికి మద్దతుగా నిలువడం పట్ల సామాజిక మాద్యమాల్లో నెటింజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లవ్ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా ఈ నెల 18వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. -
ఆ విషయంలో మేము ఫెయిల్ అయ్యాం : ‘లవ్‌రెడ్డి’ డైరెక్టర్
‘మా ‘లవ్ రెడ్డి’ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ అంటున్నారు. అయితే సినిమాను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా రీచ్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యాం’ అన్నారు యంగ్ డైరెక్టర్ స్మరణ్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొన్ని యదార్థ ఘటనలకు ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను రూపొందించాను. మొదట్లో మా మూవీని దీపావళికి రిలీజ్ అనుకున్నాం. అయితే అప్పుడు కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కు అనౌన్స్ అవుతున్నాయి. స్టార్స్ మూవీస్ మధ్యలో మా చిన్న సినిమా నలిగిపోతుందని ఇప్పుడు రిలీజ్ కు వచ్చాం. మా మూవీని ఆడియెన్స్ కు రీచ్ చేయడంలో తగినంత టైమ్ దొరకలేదు. మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. ఇందులో ఏడాది పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీద స్పెండ్ చేశాం. ఇదంతా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకే. అందుకే ప్రేక్షకులు టీవీలో కాకుండా థియేటర్ లోనే మా సినిమా చూడాలని మేమంతా కోరుకుంటున్నాం. మంచి సినిమాను బతికించమని మా టీమ్ అంతా రిక్వెస్ట్ చేస్తున్నాం’ అన్నారు.‘మా మూవీ చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నారు. ఎవరికైతే మా సినిమా రీచ్ కాకుండా వాళ్లు చూడలేకపోతే అది మా ఫెయిల్యూర్ గా భావిస్తాం. ప్రతి సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అయితే ఓవరాల్ గా "లవ్ రెడ్డి" సినిమాకు మూవీ చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారనే చెబుతున్నారు. ఈ వీకెండ్ లోపు మా సినిమా బాగా పికప్ అవుతుందనే గట్టి నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం. అయితే చిత్ర పరిశ్రమ నుంచి మా మూవీకి చిన్న సపోర్ట్ దొరుకుతుందని ఎదురుచూస్తున్నాం’అని హీరో అంజన్ రామచంద్ర అన్నారు. ‘‘లవ్ రెడ్డి’సినిమాతో మా హీరోకు పేరొచ్చింది. మా హీరోయిన్ కు పేరొచ్చింది, మా డైరెక్టర్ కు పేరొచ్చింది. నిర్మాతగా ఆ సంతృప్తి నాకు చాలు’అని నిర్మాత మదన్ గోపాల్ అన్నారు. -
మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ హీరో.. చెప్పిన పని చేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం క మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1970వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.అయితే కిరణ్ ఇటీవల లవ్ రెడ్డి అనే మూవీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం లవ్ రెడ్డి మూవీ షోలు ఉచితంగా వేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఇవాళ నాలుగు థియేటర్లలో లవ్ రెడ్డి సినిమా ఫ్రీ షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్, వైజాగ్ శ్రీరామా థియేటర్ , తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్, విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ ఉచితంగా సినిమాను వేశారు. ఈ సందర్భంగా లవ్ రెడ్డి మూవీ టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది. మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడినందుకు ప్రశంసలు కురిపించింది.కాగా.. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి". ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన లవ్ రెడ్డి ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. As promised we have arranged 4 free shows.- Hyderabad : GPR Multiplex 7:45PM Show (Contact No : 8549955111)- Vizag : Srirama Theatre 6:30PM Show- Tirupathi - Krishna Teja Theatre 6:30Pm- Vijaywada - Swarna Multiplex 6:30PM Please go watch and show your support for all the…— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2024 -
కథ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి: కిరణ్ అబ్బవరం
‘‘నేను, అంజన్ షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చాం. మూడేళ్లుగా అంజన్ ఫ్యామిలీ అంతా ‘లవ్ రెడ్డి’ సినిమా కోసం కష్టపడుతున్నారు. కథ నచ్చితే ఈ సినిమాను మనస్ఫూర్తిగా స΄ోర్ట్ చేయండి. నా వంతుగా ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షోని నేను స్పాన్సర్ చేస్తాను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. సునంద బి. రెడ్డి, హేమలతా రెడ్డి, రవీందర్ .జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించారు. సుమ, సుష్మిత, హరీష్, బాబు, రవికిరణ్, జకారియా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ‘లవ్ రెడ్డి’ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. (చదవండి: ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ)ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అంజన్‌కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లి΄ోయే ఉద్దేశం లేదు.. తను మంచి స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు. ‘‘కథ పరంగా ‘లవ్ రెడ్డి’ పెద్ద సినిమానే’’ అని మదన్ గో΄ాల్ రెడ్డి, యశస్విని చె΄్పారు. ‘‘ఇటీవల హిందూపురంలో మా సినిమా ప్రివ్యూ వేస్తే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు స్మరణ్ రెడ్డి. ‘‘మీరు థియేటర్లోకి వెళ్లి కూర్చోండి చాలు... మా మూవీనే మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది’’ అని శ్రావణి తెలి΄ారు. ‘‘మా సినిమా నచ్చి తెలుగులో మైత్రీ మూవీస్, కన్నడలో హోంబలే ఫిలింస్ రిలీజ్ చేస్తున్నాయి’’ అని అంజన్ రామచంద్ర చె΄్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ మాట్లాడారు. -
‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్రెడ్డినటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, యన్.టి. రామస్వామి, గణేశ్, పల్లవి తదితరులునిర్మాణ సంస్థ: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి రచన-దర్శకత్వం: స్మరన్ రెడ్డిసంగీతం: ప్రిన్స్ హేన్రిఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: అక్టోబర్ 18, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు ప్రేక్షకులు. కథలో దమ్ముంటే నటీనటులను ఎవరనేది కూడా చూడడం లేదు. అందుకే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలా తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. అదే ‘లవ్‌రెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికితోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లవ్‌రెడ్డి’ పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు(అక్టోబర్ 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ’ ఒక్కటే’. సినిమా ముగింపులో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే చిత్ర కథనమంతా సాగుతుంది. పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ఓ సున్నితమైన ప్రేమకథను ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ స్మరన్ రెడ్డి. వినోదాత్మకంగా కథను ప్రారంభించి.. చివరిలో ప్రేక్షకుడి గుండెను బరవెక్కించి థియేటర్ నుంచి బయటకు పంపించేశాడు. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కథనాన్ని నడిపించాడు. కొత్త నటీనటులే అయినప్పటికీ వారి నుంచి మంచి ఫెర్పార్మెన్స్ని రాబట్టుకున్నాడు. పెళ్లి చూపుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉంటాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్ వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోతుంది. నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు. దివ్య పాత్రతో నేటితరం అమ్మాయిలు చాలా వరకు కనెక్ట్ అయిపోతారు. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ మన గుండెను బరువెక్కిస్తుంది. అలా అని ఈ క్లైమాక్స్ కొత్తదని చెప్పలేం. గతంలో చాలా ప్రేమ కథలకు ఇలాంటి క్లైమాక్స్ ఉంది. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతాం. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని.. పేరున్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది. ఏదేమైనా తొలి సినిమాతోనే ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. అయినా కూడా చాలా చక్కగా నటించాడు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా నటించిన ఎన్.టి రామస్వామి ఫెర్ఫార్మెన్స్ అయితే నెక్ట్స్ లెవన్. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా నటించిన తమ్ముడితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'లవ్ రెడ్డి' మూవీ.. కైలాష్ ఖేర్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'లవ్ రెడ్డి'. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. స్మరన్ రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)ఈ సినిమాలోని 'ప్రాణం కన్నా..' అనే లిరికల్ పాటని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పాడిన ఈ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ప్రాణం కన్నా ప్రేమించినా..ఆ ప్రేమనే తెంచావుగా....' అంటూ ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందీ పాట. 'ప్రాణం కన్నా..' పాటకు 'లవ్ రెడ్డి' మూవీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?) -
‘లవ్‌రెడ్డి’ నాకు చాలా స్పెషల్ : స్మరన్ రెడ్డి
‘లవ్‌రెడ్డి..నా మొదటి సినిమా. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాను. సినిమాలో చిన్న గాలి సౌండ్ కూడా వదల్లేదు. ఎక్కడ ఏ సీన్ ఉండాలి.. ఏ మేరకు ఉండాలి అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా తొలి సినిమానే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది’అన్నారు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లవ్ రెడ్డి’. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న అక్టోబర్ 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ స్మరన్ రెడ్డి మాట్లాడుతూ.. లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర. మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలేనిది. ఈ కొత్త ప్రేమ కథ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. ‘సినిమా ఎండింగ్ లో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు’ అని హీరో అంజన్ రామచంద్ర అన్నారు. ‘మంచి కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత మదన్ అన్నారు. -
ఆంధ్ర , కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ ‘లవ్ రెడ్డి’
అంజన్ రామచంద్ర, శ్రావణీ రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ హేమలతా రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మించారు. ఈ చిత్రం గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లవ్ రెడ్డి’ గ్లింప్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ గ్లింప్స్ చూశాక నాకు కూడా ఒక లవ్‌స్టోరీ చెయ్యాలనిపిస్తోంది. యంగ్ టీమ్ చేసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఆంధ్ర , కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు స్మరన్ రెడ్డి. ‘‘ఒక మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది అన్నారు’’ అంజన్ రామచంద్ర.