‘మా ‘లవ్ రెడ్డి’ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ అంటున్నారు. అయితే సినిమాను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా రీచ్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యాం’ అన్నారు యంగ్ డైరెక్టర్ స్మరణ్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్‌ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొన్ని యదార్థ ఘటనలకు ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను రూపొందించాను. మొదట్లో మా మూవీని దీపావళికి రిలీజ్ అనుకున్నాం. అయితే అప్పుడు కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కు అనౌన్స్ అవుతున్నాయి. స్టార్స్ మూవీస్ మధ్యలో మా చిన్న సినిమా నలిగిపోతుందని ఇప్పుడు రిలీజ్ కు వచ్చాం. మా మూవీని ఆడియెన్స్ కు రీచ్ చేయడంలో తగినంత టైమ్ దొరకలేదు. మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. ఇందులో ఏడాది పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీద స్పెండ్ చేశాం. ఇదంతా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకే. అందుకే ప్రేక్షకులు టీవీలో కాకుండా థియేటర్ లోనే మా సినిమా చూడాలని మేమంతా కోరుకుంటున్నాం. మంచి సినిమాను బతికించమని మా టీమ్ అంతా రిక్వెస్ట్ చేస్తున్నాం’ అన్నారు.
‘మా మూవీ చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నారు. ఎవరికైతే మా సినిమా రీచ్ కాకుండా వాళ్లు చూడలేకపోతే అది మా ఫెయిల్యూర్ గా భావిస్తాం. ప్రతి సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అయితే ఓవరాల్ గా "లవ్ రెడ్డి" సినిమాకు మూవీ చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారనే చెబుతున్నారు. ఈ వీకెండ్ లోపు మా సినిమా బాగా పికప్ అవుతుందనే గట్టి నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం. అయితే చిత్ర పరిశ్రమ నుంచి మా మూవీకి చిన్న సపోర్ట్ దొరుకుతుందని ఎదురుచూస్తున్నాం’అని హీరో అంజన్ రామచంద్ర అన్నారు.
‘‘లవ్ రెడ్డి’సినిమాతో మా హీరోకు పేరొచ్చింది. మా హీరోయిన్ కు పేరొచ్చింది, మా డైరెక్టర్ కు పేరొచ్చింది. నిర్మాతగా ఆ సంతృప్తి నాకు చాలు’అని నిర్మాత మదన్ గోపాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment