చిన్న సినిమాకు అండగా నిలిచిన ప్రభాస్‌ | Actor Prabhas Has Expressed His Support For Love Reddy Film, Social Media Post Goes Viral | Sakshi
Sakshi News home page

Prabhas On Love Reddy Movie: ‘లవ్‌రెడ్డి’కి అండగా నిలిచిన ప్రభాస్‌

Published Sun, Oct 20 2024 3:10 PM | Last Updated on Sun, Oct 20 2024 4:55 PM

Prabhas Has Expressed His Support For Love Reddy Film

ఒక సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. దాన్ని ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా ప్రచారం చేయడం కూడా అంతే కష్టం. ఎంత మంచి సినిమా తీసినా సరే.. అది జనాల్లోకి తీసుకెళ్లకపోతే అంతే సంగతి. ఈ విషయంలో చిన్న సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అందుకే ప్రమోషన్స్‌ కోసం పెద్ద హీరోలను సంప్రదిస్తుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే అడిగిన వెంటనే తమవంతు సహాయం చేస్తుంటారు. వారిలో డార్లింగ్‌ ప్రభాస్‌ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా లవ్‌రెడ్డి అనే ఓ చిన్న చిత్రాన్ని ప్రొత్సహిస్తూ ఇన్‌స్టా వేదికగా తన మద్దతు ప్రకటించాడు.

లవ్ రెడ్డి చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తన అభిమానుల కోసం లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి అండంగా నిలువాలని ప్రభాస్ కోరారు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి మద్దతు ఇవ్వగా ప్రభాస్ లాంటి అగ్ర హీరో లవ్ రెడ్డి చిత్రానికి అండగా నిలువడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రభాస్ లవ్ రెడ్డి చిత్రానికి మద్దతుగా నిలువడం పట్ల సామాజిక మాద్యమాల్లో నెటింజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లవ్ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా ఈ నెల 18వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement