‘లవ్‌రెడ్డి’ నాకు చాలా స్పెషల్‌ : స్మరన్‌ రెడ్డి | Young Director Smaran Reddy Talk About Love Reddy Movie At Teaser Launch Event | Sakshi
Sakshi News home page

‘లవ్‌రెడ్డి’ నాకు చాలా స్పెషల్‌ : స్మరన్‌ రెడ్డి

Published Thu, Oct 3 2024 3:34 PM | Last Updated on Thu, Oct 3 2024 5:14 PM

Young Director Smaran Reddy Talk About Love Reddy Movie At Teaser Launch Event

‘లవ్‌రెడ్డి..నా మొదటి సినిమా. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాను. సినిమాలో చిన్న గాలి సౌండ్‌ కూడా వదల్లేదు. ఎక్కడ ఏ సీన్‌ ఉండాలి.. ఏ మేరకు ఉండాలి అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ మూవీ నాకు చాలా స్పెషల్‌.  నా తొలి సినిమానే మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది’అన్నారు యంగ్‌ డైరెక్టర్‌ స్మరన్‌ రెడ్డి.  ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లవ్‌ రెడ్డి’. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్,  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న అక్టోబర్‌ 18న విడుదల కానుంది. 

 తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా డైరెక్టర్‌ స్మరన్‌ రెడ్డి మాట్లాడుతూ..  లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర. మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలేనిది. ఈ కొత్త ప్రేమ కథ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

 ‘ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. ‘సినిమా ఎండింగ్ లో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు’ అని హీరో అంజన్ రామచంద్ర అన్నారు.  ‘మంచి కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత మదన్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement