ఓటీటీకి వచ్చేస్తోన్న 'లవ్ రెడ్డి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tollywood Movie Love Reddy Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Tollywood Movie OTT Release: ఓటీటీకి రాయలసీమ ప్రేమకథా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Dec 31 2024 8:55 PM | Last Updated on Tue, Dec 31 2024 9:16 PM

Tollywood Movie Love Reddy Streaming On This Ott From This Date

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్ రెడ్డి'. ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా  ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా స్మరన్ రెడ్డి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని పోస్టర్‌ ద్వారా ఆహా వెల్లడించింది. 

లవ్ రెడ్డి అసలు కథేంటంటే..

ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్‌లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్‌ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలా టర్న్‌ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement