బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut ) హిమాలయాల్లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ది మౌంటెన్ స్టోరీ (The Mountain Story) పేరుతో ఆమె కేఫ్, రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 14న హిమాచల్ ప్రదేశ్‌లో ఎంతో పాపులర్ అయిన వంటకాలతో తన రెస్టారెంట్ ప్రారంభం అవుతుందని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోతో పంచుకున్నారు.
రెస్టారెంట్ ప్రారంభించడం అనేది తన చిన్ననాటి కల అని కంగనా తెలిపారు. తన అమ్మగారి వంటగదిలో ఉన్నప్పుడే అందుకు తొలి బీజం పడిందని గుర్తుచేసుకున్నారు. ఆధునిక టచ్‌తో పాటుగా సాంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను అందించాలని తాను అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది మీతో నాకున్న రిలేషన్ షిప్ స్టోరీగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ వీడియోను కూడా షేర్ చేయడంతో అందులోని ఇంటీరియర్ డిజైన్ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. స్థానిక హిమాచలీ కళాఖండాలతో పాటు సుందరమైన పర్వత దృశ్యంతో బహిరంగ సీటింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది.
పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన కంగనా తన ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఇలా తెలిపారు. 'పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు, అడవులు నా ఆలోచనలు, నక్షత్రాలు నా కలలు" అని రాస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ చిత్రాలను కూడా ఆమె పంచుకున్నారు. చుట్టూ పర్వాతల మధ్యలో మంచు పడుతున్న వేళలో అక్కడి ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటే ఆ సంతోషానికి హద్దులు ఉండవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలో తప్పకుండా అక్కడికి వచ్చి రెస్టారెంట్‌లోని అన్ని వంటకాలను రుచి చూస్తామని, కంగనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment