Himalaya Mountains
-
హిమాలయాలకు బయల్దేరిన రజనీకాంత్.. ఎన్నికలపై కామెంట్
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. బుధవారం చెన్నై నుంచి విమానంలో ఆయన బయల్దేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయనున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం.. హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. అందుకే తాను ప్రతి ఏటా వెళ్తున్నట్లు అన్నారు.ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలు దేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతానని.. ఇప్పుడు కూడా బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. గతేడాది జైలర్ సినిమా విడుదలకు ముందు కూడా హిమాలయాలకు రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే.ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు. అలాగే, రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు సమాచారం. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ సినిమాలో తన భాగం చిత్రీకరణని పూర్తి చేశారు రజనీ. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని రజనీ తెలిపారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్‌లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్‌సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్‌ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్‌లో 26 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం, బీహార్‌లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్‌కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..
భూమిగా ఏర్పడటానికి ముందు అగ్ని గోళంలో ఉండేదని క్రమేణ ఘనీభవించిన మంచులా ఉందని ఆ తర్వాత విస్పోటనం చెంది భూమిగా ఏర్పడిందని తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న సముద్రాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), జపాన్‌లోని నీగాట యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించారు. భూమి చరిత్రకు సంబంధించిన ఆక్సిజనేషన్ ఏర్పడుటకు దారితీసిన సంఘటనలను గురించి తమ అధ్యయనంలో వెల్లడించారు. శాస్త్రవేత్తలు సుమారు 700 నుంచి 500 మిలియన్ల సంవత్సరాల క్రితం స్నోబాల్ ఎర్త్ గ్లేసియోషన్ అని పిలిచే మందపాటి మంచు పలకలు భూమిని కంపి ఉంచినట్లు విశ్వసిస్తారు. భూమిపై ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదలను రెండొవ ఆక్సిజనేషన్ ఈవెంట్‌గా పిలుస్తారు. భూమి ప్రారంభక్రమంలో ఈ ఆక్సిజన్ రకరకాలుగా మార్పు చెంది చివరికి జీవనానికి ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందింది. భూమి పుట్టుకకు ముందు ఉన్న ఉనికి కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించిన శిలాజాలు, సముద్రాలు మాయమవ్వడంతో అదోక అంతుపట్టిని మిస్టరిలా ఉండిపోయింది. ప్రస్తుతం హిమలయాల్లో అటువంటి సముద్ర ఫలకాలకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించడంతో ఆ విషయాలను కనుగొనవచ్చు అనే కొత్త ఆశ పరిశోధకుల్లో చిగురించడం ప్రారంభమైంది. శాస్త్రవేత్తల బృందం కనుగొన్న నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ సమయానికి చెందినదని, కాల్షియంను కోల్పోయినట్లు గుర్తించారు. మహాసముద్రాల్లో ప్రవహం లేదు గనుక కాల్షియం అవక్షేపం ఉండదని, దానిలో నెమ్మదిగా మెగ్నిషియం పెరుతుందని అన్నారు. అందువల్లే ఈ మహాసముద్రం ఘనీభవించినప్పుడూ ఏర్పడిన మెగ్నిషియంను వాటి రంధ్రాల్లో బంధించిందని పరిశోధకులు చెబుతున్నారు. కాల్షియం లేమి పోషకాహర లోపానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే సైనో బాక్టీరియాకు అనుకూలంగా మారింది. దీంతో వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ బయటకు పంపడం జరిగిందని తెలిపారు. వాతావరణంలో ఆక్సిజన్ పెరిగినప్పుడల్లా జీవసంబంధమైన రేడియేషన్ ఉంటుంది అని శాస్త్రవేత్త ఆర్య చెప్పారు. దీనికోసం శాస్త్రవేత్లల బృందం పశ్చిమ కుమావోన్ హిమాలయాలలో అమృత్పుర్ నుంచి మిలామ్ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రుడూన్ నుంచి గంగోత్రి వరకు అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం అన్వేషించారు. ఈ నిక్షేపాలు పురాతన సముద్రపునీటి ఉనికిని వెల్లడించాయి. ఇది భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
హిమాలయాలపై భయాంకర నిజాలను వెల్లడించిన ఐఐటీ ఇండోర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పులు. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో అకాల వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో హిమాలయాల్లో గ్లేసియర్ కరిగిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను వెల్లడించింది. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం, ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని పేర్కొన్నారు. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్ పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తెలిపారు. హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయని హెచ్చరించారు. మైదానాలు పూర్తిగా ఏడారులే..! హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలు 2.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, హిమానీనదాలతో ఈ ప్రాంతంలోని ఒక బిలియన్ మందికి పైగా నీటి అవసరాలు తీరుతాయి. ఒక శతాబ్దం అంతా హిమానీనదాల మంచు కరిగిపోతే, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్వహకులు డాక్టర్ ఆజామ్ తెలిపారు. గంగా నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఏడారిగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఐఐటీ ఇండోర్ బృందం గ్లేసియర్ కరిగిపోతున్న సమస్యకు మూడు రకాల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, పరిశీలన నెట్‌వర్క్‌లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఈ బృందం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా అధ్యయనాలను జరపాలి. ఈ పరిశోధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. చదవండి: Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది
అనంతపురం నుంచి సమీరా ఖాన్ అనే అమ్మాయి హిమాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నేపాల్‌లోని అమా దబ్లమ్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్‌ను అందరిలా నేపాల్ వైపు నుంచి కాక టిబెట్ వైపు నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. సైకిల్ మీద దేశంలోని ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగేసిన సమీరా ఖాన్‌కు తల్లిదండ్రులు లేరు. కుటుంబ మద్దతు లేకపోయినా అమ్మాయిలు తాము అనుకున్నది సాధించగలరు అని ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి అరచి చెప్పాలని ఉందని సమీరా అంటోంది. సమీరా ఖాన్ మన తెలుగమ్మాయి అయినా తెలుగువారి కంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. పర్వతాలు ఎక్కాలనే సంకల్పంతో తరచూ ఆవైపే తిరుగుతుంటుంది సమీరా. నేపాల్, టిబెట్‌లకు పక్కింటికి వెళ్లినట్టు వెళుతుంటుంది. ‘పర్వతాన్ని అధిరోహించడం ఏదో సరదా కాదు నాకు. అదొక జీవన విధానం’ అంటుంది సమీరా. అనంతపురంకు చెందిన సమీరా ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సంస్థలో పని చేస్తోంది. కాని టైలర్‌గా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాక ఆమె ఈ ప్రపంచమే తన ఇల్లు అనుకుంది. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. ఐదుమంది సంతానం లో చివరిదైన సమీరా ఇంటి నుంచి ఏ మద్దతు కోరకుండా ఒక్కదానిగా ఏదైనా సాధించాలనుకుంది. ‘నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. దేశంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ మీద ఒక్కదాన్నే తిరిగాను’ అంటుంది సమీరా. కాని ఆమెకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ‘నేను పదో క్లాసు వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం బెంగళూరులో ఒక బి.పి.ఓలో పని చేశాను. ఒక్కదాన్నే ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ధైర్యం వచ్చింది. సైకిల్ వేసుకొని ఒక్కదాన్నే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లి రావడం మొదలుపెట్టాను’ అంది సమీరా ఖాన్. ‘2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చినప్పుడు వాలెంటీర్‌గా పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో రెండు రోజులు ట్రెక్కింగ్ చేశాను. ధైర్యం వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థమైంది. పర్వతారోహణ మీద ఆసక్తి ఏర్పడింది. నేపాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దాదాపు 500 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పూర్తి చేశాను. నా శక్తి ఇంకా పెరిగినట్టనిపించింది. నేపాల్‌లో, హిమాలయాల్లో ఉన్న నాలుగు పెద్ద పర్వతాలు ఎక్కాను. ఇక ఎవరెస్ట్ మిగిలింది. దానిని అందరూ సులువని నేపాల్ వైపుగా ఎక్కుతారు. ఏదో ఎక్కామంటే ఎక్కాం అని చెప్పడానికి ఎక్కడం ఎందుకు? నేను టిబెట్ వైపు నుంచి చాలా నైపుణ్యంతో సవాలుతో ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను’ అంది సమీరా ఖాన్. ట్రెక్కింగ్, పర్వతారోహణలో సమీరా ఖాన్ ఆమె ఇంతవరకూ పర్వతారోహణలో ట్రైనింగ్ తీసుకోలేదు. లండన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. దానికి రెండు మూడు లక్షలు కావాలి. ఎవరెస్ట్ అధిరోహణకు కూడా కొన్ని లక్షల ఖర్చు ఉంది. ‘నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంకొంత స్పాన్సర్షిప్ కావాలి. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే పర్వతారోహణ ఒక క్రీడ కాదు అని చెప్పి పంపించేశారు. ఏం చేయాలి’ అంది ఈ సాహసి. ‘నాకు స్త్రీలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలని ఉంది. ఈ సమాజంలో నా గొంతు వినిపించాలని ఉంది. ఎవరెస్ట్ అధిరోహించి, ఆ యోగ్యతతో నేను చెప్పాలనుకున్నది స్త్రీల తరఫున అరచి చెప్తాను’ అంటోంది సమీరా ఖాన్. ఆమె పట్టుదల చూస్తుంటే త్వరలోనే స్త్రీల తరఫున ఒక గట్టి గొంతు వింటాం. – సాక్షి ఫ్యామిలీ -
వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!
బ్రిటన్: వర్షాలు మావనాళి మనుగడకు ఎంతో అవసరం.. అదే ఉగ్రరూపం దాలిస్తే.. ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో గత వారం రోజులుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఏటా వర్షాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టాని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాలకు నదులు కోసుకుపోవడం.. వరద బీభత్సం వంటి వాటి గురించి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వర్షాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వర్షాలు భారీ శిఖరాలను సైతం కదిలిస్తాయని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. భూగర్భ శాస్త్రవేత్తలకు పర్వతాలపై వర్షం ఎలా ప్రభావం చూపిస్తుందో సమర్థవంతంగా అధ్యయనం చేయడంలోనే కాకుండా, వందల ఏళ్ల క్రితం శిఖరాలు, లోయలు ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు సహకరిస్తాయి. (చదవండి: కలిసికట్టుగా ఊడ్చేశారు.. టీంవర్క్ అంటే ఇది) పీర్-రివ్యూ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన ‘క్లైమెట్ కంట్రోల్స్ ఆన్ ఎరోషన్ ఇన్ టెక్టోనికల్లీ యాక్టీవ్ ల్యాండ్‌స్కేప్స్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనాన్ని డాక్టర్ బైరాన్ ఆడమ్స్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించింది. ఇందుకు గాను, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన బృందం తూర్పు హిమాలయాల్లో భాగామైన భూటాన్, నేపాల్‌లో అధ్యయనం నిర్వహించింది. బ్రిస్టల్ క్యాబోట్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ రాయల్ సొసైటీ డోరతీ హోడ్కిన్కి చెందిన డాక్టర్ బైరాన్ ఆడమ్స్ ఈ అధ్యయనం కోసం అరిజోనా స్టేట్ యూనివర్శిటీ (ఏఎస్యూ), లూసియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులతో కలిసి పనిచేశారు. నదులు వాటి క్రింద ఉన్న రాళ్ళను క్షీణింపజేసే వేగాన్ని కొలవడానికి వారు ఇసుక రేణువుల లోపల విశ్వ గడియారాలను ఉపయోగించారు. టెక్టోనిక్స్పై వాతావరణం ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఈ స్టడీ ప్రధాన లక్ష్యం. (చదవండి: 'విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు') ఈ స్టడీ ప్రధాన రచయిత, డాక్టర్ బైరాన్ ఆడమ్స్ మాట్లాడుతూ, భూటాన్, నేపాల్ అంతటా గమనించిన "ఎరోషన్ రేట్ ప్యాటర్" ను పునరుత్పత్తి చేయడానికి బృందం అనేక సంఖ్యా నమూనాలను పరీక్షించింది. కోత రేటును ఖచ్చితంగా అంచనా వేయగల ఒక నమూనాను వారు గుర్తించగలిగారు. ఆ తర్వాత, వర్షపాతం "కఠినమైన భూభాగాలలో కోత రేటు" ను ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేయడానికి పరిశోధకులు ఈ నమూనాను ఉపయోగించారు. -
ఆర్థికసాయం చేయండి
సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): ఆర్థికస్థోమత లేకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపడా ఆత్మవిశ్వాసం ఉంది. అందరిలో ఒకరిలా కాకుండా నాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరో. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగడంతో గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచనలకు ఆకర్షితుడయ్యాడు. సాధించాలనే తపన, పట్టుదలతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు భువనగిరిలోని రాక్ క్లైంబింగ్లో శిక్షణ పొందాడు. పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరోది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామం. తండ్రి అశోక్, తల్లి కంసమ్మ రోజూ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్యామ్‌ప్రసాద్ ప్రాథమిక విద్యాబ్యాసం అనంతసాగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివాడు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిండాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచనలతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు ఎంపిక చేశారు. అందులో శ్యామ్ ప్రసాద్ ఒకరు. దీనికోసం భువనగిరిలో కోచ్ శేఖర్‌బాబు వద్ద 15 రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2014లో 25 రోజుల పాటు 20 మంది విద్యార్థులతో కలిసి హిమాలయ పర్వతాన్ని అదిరోహించాడు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన మలావత్ పూర్ణ హిమాలయ పర్వతాలు అధిరోహించిన సభ్యుల్లో శ్యామ్‌ప్రసాద్ కూడా సభ్యుడిగా ఉన్నడు. దాతలు సహకరించాలి హిమాలయ పర్వతాలు అధిరోహించిన స్ఫూర్తితో ప్రపంచంలోనే రెండో ఎత్తైన సౌతాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యాం ప్రసాద్ ఎంపికయ్యాడు. కిలీమంజారో వెళ్లడానికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు కూలీలు కావడంతో వారికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఈ నెల 25వ తేదీ వరకు చెల్లించాలి. లేకపోతే వచ్చిన అవకాశం చేజారిపోతుందని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తే జిల్లా పేరును ప్రపంచస్థాయిలో నిలబెడతానని విద్యార్థి శ్యాం ప్రసాద్ పేర్కంటున్నాడు. -
వయాగ్రా కోసం వెళ్లి 8 మంది మృతి!
ఖాట్మాండు : అరుదుగా లభించే వనమూలిక, హిమాలయా వయాగ్రా పేరుగాంచిన ‘యార్సాగుంబా’ కోసం వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యార్సాగుంబా కోసం హిమాలయాలు ఎక్కిన 8 మందిలో ఐదుగురు ఆనారోగ్యంతో మరణించారని, ఇద్దరు అత్యంత ఖరీదైన వనమూలిక పీకే క్రమంలో కొండపై నుంచి జారిపడి తుదిశ్వాస విడిచారన్నారు. ఇక తన తల్లితో వెళ్లిన ఓ చిన్నారి సైతం అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయడన్నారు. ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా యార్సాగుంబా కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం. గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్ ఛాంగ్ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. యార్సాగుంబా సేకరించేవారి కోసం ప్రభుత్వం హెల్త్‌క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేసింది. చాలామంది సేకరణదారులు ఈ హెల్త్‌క్యాంప్‌ల్లో చికిత్స పొందారని అధికారులు వెల్లడించారు. నేపాల్ రాజధాని ఖట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండే డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణదారులు ఎక్కువగా ఉంటారు. -
కాంచనగంగ అధిరోహిస్తూ...
కోల్‌కత : నేపాల్ భూభాగంలోని కాంచనగంగ పర్వతాన్ని అధిరోహిస్తూ ఇద్దరు పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులను కోల్‌కతాకు చెందిన విప్లవ్ వైద్య (48), కుంతల్ కర్నార్ (46)గా గుర్తించారు. హిమాలయ పర్వాతశ్రేణిలోని కాంచనగంగ 8,586 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వత శిఖరంగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో.. సముద్రమట్టం నుంచి 8వేల మీటర్ల ఎత్తులో ఉండగా వైద్య, కర్నార్ మరణించారని పసంగ్ షెర్పా అనే వ్యక్తి వెల్లడించాడు. పర్వతాన్ని అధిరోహించి తిరుగుపయనమైన వైద్య, పర్వతాన్ని అధిరోహిస్తూ కర్నార్ ప్రాణాలు విడిచారని చెప్పారు. ఎత్తులో ఉండటం వల్ల అనారోగ్యం సంభవించి ఈ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరు మౌంటేన్ హైకింగ్ కంపెనీకి చెందిన వారుగా తెలిసింది. ఇక స్ర్పింగ్ క్లైంబింగ్ సీజన్ ఈ నెలతో ముగియనుండటంతో వందలాది పర్వతారోహకులు హిమాలయా పర్వత శ్రేణులను అధిరోహిస్తున్నారు. -
హిమాలయాల్లో మరోసారి యతి జాడలు
న్యూఢిల్లీ : తరతరాలుగా చెప్పుకుంటున్న యతి వింతజీవి మరోసారి వార్తల్లోకి వచ్చింది. యెతి పాదముద్రలను తాము గుర్తించామంటూ భారతసైన్యం తాజాగా ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. యతి అనే వింతజీవి మానవుల కన్నా పెద్ద పరిమాణంలో, కోతి లేదా ఎలుగుబంటి ఆకారంలో ఉండి, ఒళ్లంతా వెంట్రుకలు ఉంటాయనీ, హిమాలయాలు, సైబీరియా, మధ్య, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ జీవి నివసిస్తుందని వందల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కథలు ఒక తరం నుంచి మరో తరానికి చేరుతున్నాయి తప్ప యతిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఇప్పటివరకు ఎవరూ లేరనే చెప్పాలి. ఏప్రిల్ రెండో తేదీన ఆర్మీ టీం ఒకటి ప్రపంచంలోనే ఐదో అత్యంత ఎత్తైన శిఖరం, నేపాల్‌లోని మకాలును అధిరోహించేందుకు వెళ్లింది. ఏప్రిల్ 9న వారికి మకాలు బేస్ క్యాంపు వద్ద 32X15 అంగుళాల పరిమాణంలో ఉన్న పాదముద్రలు కనిపించాయనీ, వాటి ఫొటోలు, వీడియోలను ఉపగ్రహ వ్యవస్థ ద్వారా తమకు పంపారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
హిమాలయాల్లో మంచుమనిషి.. యతి పాదముద్రలు లభ్యం!
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాల్లో తొలిసారిగా మంచుమనిషి ‘యతి’ పాదముద్రలను కనుగొన్నట్టు భారత సైన్యం సోమవారం ట్వీట్ చేసింది. ఈ నెల 9వ తేదీన హిమాలయాల్లోని మాకులా బేస్ క్యాంప్ సమీపంలో భారత ఆర్మీకి చెందిన పర్వతాధిరోహణ బృందం పౌరాణిక మృగంగా భావించే యతి పాదముద్రలు కనుగొన్నదని, యతీ పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నాయని, మాకులా-బరూన్ జాతీయ పార్కు సమీపంలో అత్యంత అరుదుగా ఈ మంచుమనిషి కనిపించేదని ఆర్మీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. భారత ఆర్మీ ప్రకటనపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, యతీని ఆర్మీ మృగంగా ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అభినందనలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. భారత ఆర్మీ పర్వతాధిరోహణ బృందానికి నా సెల్యూట్. కానీ, ఒక భారతీయుడిగా యతిని మృగంగా అభివర్ణించకండి. కావాలంటే మంచుమనిషి అని పేర్కొనండి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యతీ పదం ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు జోకులు వేస్తున్నారు. ‘సర్. యతీని స్నోపర్సన్‌గా పేర్కొనండి. ఎవరికీ తెలుసు. ఆర్మీ కనుగొన్న పాదముద్రలు యతీ భార్యవి కావొచ్చు. లింగభేదాన్ని గుర్తించాల్సిన అవసరముంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. భారతీయ భాషలో రాయండి.. ఆంగ్లంలో రాసి యతీని అవమానించకండి అంటూ మరొకరు సెటైర్ వేశారు. మోడీజీకి ఓటు వేసేందుకు యతీ బయటకు వచ్చినట్టుందని ఒకరు కామెంట్ చేయగా.. ఆ పాదముద్రలు మంచులో మార్నింగ్ వాక్కు వెళ్లిన అమిత్ షావి అయ్యుండవచ్చునని మరొకరు చమత్కరించారు. Congratulations, we are always proud of you. salutes to the #IndianArmy Moutaineering Expedition Team. But please, you are Indian, dont call Yeti as beast. Show respect for them. If you say he is a 'snowman'. — Chowkidar Tarun Vijay (@Tarunvijay) 29 April 2019 -
హిమాలయాల్లో ఓ పర్వతానికి వాజ్‌పేయ్ పేరు
డెహ్రడూన్ : భారత మాజీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాలయాల్లోని ఓ పర్వాతానికి వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఉత్తరఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ప్రకటించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘వాజ్‌పేయి వల్లనే ఉత్తరఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆయన మా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును ఎన్నటికి మరవం. వాజ్‌పేయి ప్రకృతి ప్రేమికుడు. అడవులు, పర్వతాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్లే హిమలయాల్లోని ఓ పర్వతానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’ అని తెలిపారు. వాజ్‌పేయి మరణించిన తరువాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, నాయకులు కేంద్రం ఆమోదంతో మాజీ ప్రధాని గౌరవార్థం తమ తమ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం బీజేపీ నాయకుడి గౌరవార్థం రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలకు వాజ్‌పేయి పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ త్వరలో నిర్మించబోయే చత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్’ను ‘అటల్ నగర్’గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అటల్ బిహారి వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. -
తమ్ముడి కోసం... సోదరి సాహసం!
ఆండీస్ పర్వతారోహణ చేసిన డాక్టర్ మల్లి దొరసానమ్మ మల్లి మస్తాన్‌బాబు పేరుతో మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు బుచ్చిరెడ్డిపాళెం: నాడి పట్టాల్సిన ఆమె నడక సాగించారు... తమ్ముడి ఆశయం కోసం సాహసిం చారు. ఆండీస్ పర్వతారోహణ చేసి ధీరురాలిగా నిలిచారు. తమ్ముడు తుదిశ్వాస విడిచిన చోట నివాళులర్పించారు. మౌంటనీరింగ్ ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. మస్తాన్‌బాబు ప్రారంభించిన మై సెవెన్ సమ్మిట్ పుస్తకంలో మిగిలిన చివరి మజిలీ అంశాలను పొందుపరుస్తున్నారు. భారతరత్న అవార్డుకు అర్హుడైన మల్లిమస్తాన్బాబుకు అవార్డు ఇవ్వాలని ఆయన సోదరి మల్లి దొరసానమ్మ కోరుతున్నారు. తమ్ముడి మాటలతో కలిగిన ఆసక్తి: నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగుల వ్యాధులను నయం చేసే పనిలో పడిన డాక్టర్ మల్లి దొరసానమ్మకు తమ్ముడు మల్లి మస్తాన్‌బాబు పర్వతారోహణపై చెప్పే మాటలు ఆసక్తిని కలిగించాయి. పర్వతాలకు సంబంధించి గూగుల్ వెతుకులాటలో తమ్ముడు పడుతున్న తపన ఆలోచింపజేశాయి. పర్వతారోహణ అనంతరం మస్తాన్‌బాబుతో తన అనుభవాలు పంచుకునేవాడు. దీంతో 2008లో తమ్ముడితో కలిసి హిమాలయ పర్వతాల్లోని రేంజల్ పాక్స్ అనే పర్వతాలను అధిరోహించా. జనవరి 24వ తేదీన మల్లిమస్తాన్‌బాబు మృతిచెందిన చోటకు బయలుదేరి వెళ్లా. భారతరత్న ఇవ్వాలి: భారతరత్న అవార్డుకు తన తమ్ముడు మల్లి మస్తాన్‌బాబు అర్హుడని, ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అర్జీలు పంపానన్నారు. -
లక్ష్యం చేరువైంది..మాతృమూర్తి దూరమైంది
♦ పర్వతారోహణ విద్యార్థికి మాతృవియోగం ♦ తల్లి మరణించిన 20 రోజులకు ఇంటికి చేరిన వెంకటేశ్ నెన్నెల : ఆ విద్యార్థి ఇటీవలే హిమాలయూల్లోని రెనాక్ పర్వతాన్ని అధిరోహించాడు. నిరుపేద కుటుంబం నుంచి ఈ ఘనత సాధించి జిల్లాకు, రాష్ట్రానికి కీర్తి సాధించాడు. కానీ ఇదే సమయంలో అతడి తల్లి మరణించింది. ఇది తెలిస్తే కొడుకు ఎక్కడ తన లక్ష్యం చేరుకోడేమో అని తండ్రి, కుటుంబసభ్యులు విషయం దాచి పెట్టారు. తాను సాధించిన ఘనతను తల్లితో పంచుకోవాలని ఆత్రుతగా స్వగ్రామానికి చేరుకున్నాడు. కానీ, తన తల్లి అంతకుముందు 20 రోజుల క్రితమే మరణించిందని తెలిసి తీవ్రంగా రోదించాడు. ఈ హృదయ విదారక సంఘటన గ్రామస్తులనూ విషాదంలో ముంచింది. ఇంటికొచ్చేదాకా తల్లి లేదని తెలియదు.. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలో మెట్పల్లి గ్రామానికి చెందిన దళిత కుటుంబంలోని ఓరెం వెంకటేశ్‌కు సిర్పూర్(టి) గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి రాజ లింగు గ్రామ సుంకరి. తల్లి రాజేశ్వరి కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పేదరికం వెం టాడుతున్నా, ధైర్యసాహసాలు ప్రదర్శించడం లో వెనుకంజ వేయలేదు. గురుకుల పాఠశాల అధికారుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హిమాలయాల్లో సాహసయూత్రకు సాహస బృందంతో కలసి నవంబర్ 10న వెళ్లాడు. 4 రోజుల క్రితం మౌంట్ రెనాక్ శిఖరం అధిరోహించాడు. అతడు సాహసయాత్రలో ఉండ గానే తల్లి రాజేశ్వరి నవంబర్ 25వ తేదీన అకస్మాత్తుగా కన్నుమూసింది. ఈ విష యం వెంకటేశ్‌కు తెలియనీయలేదు. ఈ నెల 13న రాత్రి సొంత మెట్‌పల్లికి చేరుకున్న వెంకటేశ్ తల్లి మృతి విషయం తెలుసుకుని విలపించాడు.