భూమిగా ఏర్పడటానికి ముందు అగ్ని గోళంలో ఉండేదని క్రమేణ ఘనీభవించిన మంచులా ఉందని ఆ తర్వాత విస్పోటనం చెంది భూమిగా ఏర్పడిందని తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న సముద్రాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), జపాన్‌లోని నీగాట యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించారు. భూమి చరిత్రకు సంబంధించిన ఆక్సిజనేషన్ ఏర్పడుటకు దారితీసిన సంఘటనలను గురించి తమ అధ్యయనంలో వెల్లడించారు.
శాస్త్రవేత్తలు సుమారు 700 నుంచి 500 మిలియన్ల సంవత్సరాల క్రితం స్నోబాల్ ఎర్త్ గ్లేసియోషన్ అని పిలిచే మందపాటి మంచు పలకలు భూమిని కంపి ఉంచినట్లు విశ్వసిస్తారు. భూమిపై ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదలను రెండొవ ఆక్సిజనేషన్ ఈవెంట్‌గా పిలుస్తారు. భూమి ప్రారంభక్రమంలో ఈ ఆక్సిజన్ రకరకాలుగా మార్పు చెంది చివరికి జీవనానికి ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందింది. భూమి పుట్టుకకు ముందు ఉన్న ఉనికి కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించిన శిలాజాలు, సముద్రాలు మాయమవ్వడంతో అదోక అంతుపట్టిని మిస్టరిలా ఉండిపోయింది.
ప్రస్తుతం హిమలయాల్లో అటువంటి సముద్ర ఫలకాలకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించడంతో ఆ విషయాలను కనుగొనవచ్చు అనే కొత్త ఆశ పరిశోధకుల్లో చిగురించడం ప్రారంభమైంది. శాస్త్రవేత్తల బృందం కనుగొన్న నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ సమయానికి చెందినదని, కాల్షియంను కోల్పోయినట్లు గుర్తించారు. మహాసముద్రాల్లో ప్రవహం లేదు గనుక కాల్షియం అవక్షేపం ఉండదని, దానిలో నెమ్మదిగా మెగ్నిషియం పెరుతుందని అన్నారు. అందువల్లే ఈ మహాసముద్రం ఘనీభవించినప్పుడూ ఏర్పడిన మెగ్నిషియంను వాటి రంధ్రాల్లో బంధించిందని పరిశోధకులు చెబుతున్నారు.
కాల్షియం లేమి పోషకాహర లోపానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే సైనో బాక్టీరియాకు అనుకూలంగా మారింది. దీంతో వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ బయటకు పంపడం జరిగిందని తెలిపారు. వాతావరణంలో ఆక్సిజన్ పెరిగినప్పుడల్లా జీవసంబంధమైన రేడియేషన్ ఉంటుంది అని శాస్త్రవేత్త ఆర్య చెప్పారు. దీనికోసం శాస్త్రవేత్లల బృందం పశ్చిమ కుమావోన్ హిమాలయాలలో అమృత్‌పుర్ నుంచి మిలామ్ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రుడూన్ నుంచి గంగోత్రి వరకు అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం అన్వేషించారు. ఈ నిక్షేపాలు పురాతన సముద్రపునీటి ఉనికిని వెల్లడించాయి. ఇది భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.
(చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!)
Comments
Please login to add a commentAdd a comment