
కోల్‌కత : నేపాల్ భూభాగంలోని కాంచనగంగ పర్వతాన్ని అధిరోహిస్తూ ఇద్దరు పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులను కోల్‌కతాకు చెందిన విప్లవ్ వైద్య (48), కుంతల్ కర్నార్ (46)గా గుర్తించారు. హిమాలయ పర్వాతశ్రేణిలోని కాంచనగంగ 8,586 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వత శిఖరంగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో.. సముద్రమట్టం నుంచి 8వేల మీటర్ల ఎత్తులో ఉండగా వైద్య, కర్నార్ మరణించారని పసంగ్ షెర్పా అనే వ్యక్తి వెల్లడించాడు. పర్వతాన్ని అధిరోహించి తిరుగుపయనమైన వైద్య, పర్వతాన్ని అధిరోహిస్తూ కర్నార్ ప్రాణాలు విడిచారని చెప్పారు. ఎత్తులో ఉండటం వల్ల అనారోగ్యం సంభవించి ఈ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరు మౌంటేన్ హైకింగ్ కంపెనీకి చెందిన వారుగా తెలిసింది. ఇక స్ర్పింగ్ క్లైంబింగ్ సీజన్ ఈ నెలతో ముగియనుండటంతో వందలాది పర్వతారోహకులు హిమాలయా పర్వత శ్రేణులను అధిరోహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment