Climbers
-
మౌంట్ ఎవరెస్ట్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఈ ఉన్నత పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. బేస్ క్యాంప్‌లో పర్యాటకులు క్యూ కడుతున్నారు. బీబీసీ నివేదిక ప్రకారం ఇటీవల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందలాది మంది పర్వతారోహకుల క్యూ కనిపిస్తుంది. వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తుంది.ఈ ఫొటోను చూసిన ది నార్తర్నర్ అనే యూజర్ ఇలా రాశాడు. ‘ఎవరెస్ట్ అతి ఎత్తయిన శిఖరం. అయిత ఇప్పుడది మురికిగా మారింది. ఇక్కడ మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. మంచులో కూరుకుపోతున్నవారికి సహాయం అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరు. కాలుష్యం మరింతగా పెరుగుతోంది. చుట్టూ దుమ్ము, ధూళి కనిపిస్తోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుంది?’ అని ప్రశ్నించాడు.భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది మే 19 ఉదయం 6 గంటలకు ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఎవరెస్ట్ పర్వతారోహణ అంత సులభం కాదు. 1953 మేలో తొలిసారిగా ఎవరెస్ట్ అధిరోహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడు వేల మంది ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అయితే ఇక్కడి చలి వాతావరణం, గాయాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృతి చెందిన వారికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు. దానిని ఎవరూ లెక్కించడం లేదు. గంటకు 100 నుండి 240 మైళ్ల వేగంతో వీచే బలమైన గాలులను ఎదుర్కోవడం పర్వతారోహకులకు పెద్ద సవాలు’ అని ఆయన పేర్కొన్నారు. రాజన్ ద్వివేది ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో మంచు శిఖరాలపై లెక్కకు మించిన పర్వతారోహకులు కనిపిస్తారు. Everest; the highest, the dirtiest and the most controversial place on Earth. Humans bypassing corpses, leaving people dying, ignoring help cries, making it dirtiest place with pollution & human wastes ; all for the glory of summit. When will it stop?! #StopCommercialAlpinism pic.twitter.com/Yahobk9c5F— The Northerner (@northerner_the) May 25, 2024 -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
కాంచనగంగ అధిరోహిస్తూ...
కోల్‌కత : నేపాల్ భూభాగంలోని కాంచనగంగ పర్వతాన్ని అధిరోహిస్తూ ఇద్దరు పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులను కోల్‌కతాకు చెందిన విప్లవ్ వైద్య (48), కుంతల్ కర్నార్ (46)గా గుర్తించారు. హిమాలయ పర్వాతశ్రేణిలోని కాంచనగంగ 8,586 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వత శిఖరంగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో.. సముద్రమట్టం నుంచి 8వేల మీటర్ల ఎత్తులో ఉండగా వైద్య, కర్నార్ మరణించారని పసంగ్ షెర్పా అనే వ్యక్తి వెల్లడించాడు. పర్వతాన్ని అధిరోహించి తిరుగుపయనమైన వైద్య, పర్వతాన్ని అధిరోహిస్తూ కర్నార్ ప్రాణాలు విడిచారని చెప్పారు. ఎత్తులో ఉండటం వల్ల అనారోగ్యం సంభవించి ఈ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరు మౌంటేన్ హైకింగ్ కంపెనీకి చెందిన వారుగా తెలిసింది. ఇక స్ర్పింగ్ క్లైంబింగ్ సీజన్ ఈ నెలతో ముగియనుండటంతో వందలాది పర్వతారోహకులు హిమాలయా పర్వత శ్రేణులను అధిరోహిస్తున్నారు. -
ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ!
కోల్ కతా: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని శనివారం ఉదయం అధిరోహించిన పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గరు పర్వతారోహకులు తిరిగివస్తూ 8 వేల అడుగుల ఎత్తులో (డెత్ జోన్) వద్ద ఆచూకీ లేకుండా పోయారు. మొత్తం పర్వతారోహణకు ఏడుగురు వెళ్లగా భట్టచార్య శుక్రవారం మృతి చెందాడు. ఆ తర్వాత మిగిలిన ఆరుగురిలో ముగ్గురు మాత్రమే క్యాంప్ 4 కు చేరుకోగా మిగిలిన ముగ్గురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆచూకీ లేకుండా పోయిన వారిలో సునీత హజ్రా, గౌతమ్ ఘోష్, పరేశ్ నాథ్ లు ఉన్నారు. క్యాంపునకు సురక్షితంగా చేరుకున్న రమేష్, మలయ్, సత్యరూప్, రుద్రప్రసాద్ లు చివరి క్యాంప్ ను చేరుకుని యాత్రను ముగించడానికి బయలుదేరారు. డెత్ జోన్ ప్రయాణంలో ఇబ్బందులకు లోనైనా తట్టుకుని గమ్యాన్ని చేరుకున్నట్లు వివరించారు. గతంలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించడానికి ప్రయత్నించి విఫలం చెందిన ప్రదీప్, చేతనా సాహులు ఈ సారి విజయవంతమవడంతో కోల్ కతా వాసులు సంబరాల్లో మునిగిపోయారు.