ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ!
కోల్ కతా: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని శనివారం ఉదయం అధిరోహించిన పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గరు పర్వతారోహకులు తిరిగివస్తూ 8 వేల అడుగుల ఎత్తులో (డెత్ జోన్) వద్ద ఆచూకీ లేకుండా పోయారు. మొత్తం పర్వతారోహణకు ఏడుగురు వెళ్లగా భట్టచార్య శుక్రవారం మృతి చెందాడు. ఆ తర్వాత మిగిలిన ఆరుగురిలో ముగ్గురు మాత్రమే క్యాంప్ 4 కు చేరుకోగా మిగిలిన ముగ్గురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
ఆచూకీ లేకుండా పోయిన వారిలో సునీత హజ్రా, గౌతమ్ ఘోష్, పరేశ్ నాథ్ లు ఉన్నారు. క్యాంపునకు సురక్షితంగా చేరుకున్న రమేష్, మలయ్, సత్యరూప్, రుద్రప్రసాద్ లు చివరి క్యాంప్ ను చేరుకుని యాత్రను ముగించడానికి బయలుదేరారు. డెత్ జోన్ ప్రయాణంలో ఇబ్బందులకు లోనైనా తట్టుకుని గమ్యాన్ని చేరుకున్నట్లు వివరించారు. గతంలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించడానికి ప్రయత్నించి విఫలం చెందిన ప్రదీప్, చేతనా సాహులు ఈ సారి విజయవంతమవడంతో కోల్ కతా వాసులు సంబరాల్లో మునిగిపోయారు.