ఓటీటీకి వచ్చేస్తోన్న గల్లీ క్రికెట్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tollywood Movie Parakramam Streaming On This OTT From This Date | Sakshi
Sakshi News home page

Parakramam OTT: నెల రోజుల్లోపే ఓటీటీకి పరాక్రమం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Thu, Sep 12 2024 3:50 PM | Last Updated on Thu, Sep 12 2024 4:00 PM

Tollywood Movie Parakramam Streaming On This OTT From This Date

బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వ‍చ్చిన చిత్రం పరాక్రమం. బీఎస్‌కే మెయిన్‌ స్ట్రీమ్‌ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో శృతి సమన్వి హీరోయిన్‌గా నటించారు. గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టులేకపోయింది.

(ఇది చదవండి: 'పరాక్రమం' టీజర్‌ విడుదల.. టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచిన విశ్వక్ సేన్)

తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 14 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మాంగల్యం మూవీతో బండి సరోజ్ కుమార్‌ టాలీవుడ్‌లో‌ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం, నిర్మాతగానూ బండి సరోజ్ కుమార్ వ్యవహరించడం మరో విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement