ఓటీటీలో దూసుకుపోతున్న టాలీవుడ్‌ మూవీ | Tollywood Movie Balu Gani Talkies Trending In Ott In Top | Sakshi
Sakshi News home page

Balu Gani Talkies: ఓటీటీలో టాలీవుడ్ సినిమా.. టాప్‌లో ట్రెండింగ్‌

Published Sun, Oct 13 2024 3:52 PM | Last Updated on Sun, Oct 13 2024 3:56 PM

Tollywood Movie Balu Gani Talkies Trending In Ott In Top

శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాలు గానీ టాకీస్. ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని శ్రీనిధి సాగర్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఆహా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సరికొత్త కంటెంట్‌ ఉంటే ఆడియన్స్‌ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలు గాని టాకీస్ ఆహాలో టాప్- 2లో ట్రెండ్ అవుతోంది. విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్‌గా ఈ  మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. తన మేకింగ్‌తో విశ్వనాథ్ ప్రతాప్ అందరినీ మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement