టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం క మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1970వ దశకంలోని విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.
అయితే కిరణ్ ఇటీవల లవ్ రెడ్డి అనే మూవీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం లవ్ రెడ్డి మూవీ షోలు ఉచితంగా వేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఇవాళ నాలుగు థియేటర్లలో లవ్ రెడ్డి సినిమా ఫ్రీ షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్, వైజాగ్ శ్రీరామా థియేటర్ , తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్, విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ ఉచితంగా సినిమాను వేశారు. ఈ సందర్భంగా లవ్ రెడ్డి మూవీ టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది. మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడినందుకు ప్రశంసలు కురిపించింది.
కాగా.. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి". ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన లవ్ రెడ్డి ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది.
As promised we have arranged 4 free shows.
- Hyderabad : GPR Multiplex 7:45PM Show (Contact No : 8549955111)
- Vizag : Srirama Theatre 6:30PM Show
- Tirupathi - Krishna Teja Theatre 6:30Pm
- Vijaywada - Swarna Multiplex 6:30PM
Please go watch and show your support for all the…— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2024
Comments
Please login to add a commentAdd a comment