శ్రీవారి సేవలో టాలీవుడ్ యంగ్ హీరో | Tollywood Hero Visits Tirumala Temple Ahead Of Movie Release | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ అబ్బవరం..వీడియో వైరల్!

Published Sun, Oct 27 2024 2:45 PM | Last Updated on Sun, Oct 27 2024 3:55 PM

Tollywood Hero Visits Tirumala Temple Ahead Of Movie Release

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మూవీ రిలీజ్‌కు ముందు శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. క మూవీ సూపర్‌హిట్ కావాలని స్వామివారికి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమలకు వచ్చిన భక్తులు తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.

టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం  పీరియాడిక్ థ్రిల్లర్ క మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతకు ముందెన్నప్పుడు రానీ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ యూట్యూబ్‌లో అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ కానుంది.

క కథేంటంటే..

'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‪‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement