'క' టీమ్‌ను అభినందించిన మెగాస్టార్‌.. కిరణ్ అబ్బవరం పోస్ట్! | Kiran Abbavaram Shares Pics meet With Megastar Chiranjeevi | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: బాస్ నుంచి ప్రశంసలు.. ఫుల్ ఖుషీగా కిరణ్ అబ్బవరం

Published Sun, Nov 10 2024 3:10 PM | Last Updated on Sun, Nov 10 2024 4:33 PM

Kiran Abbavaram Shares Pics meet With Megastar Chiranjeevi

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్‌, అమరన్‌ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

(ఇది చదవండి: కిరణ్‌ పనైపోయిందన్నారు.. కానీ పోరాటం ఆపలేదు: బన్నీ వాసు)

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'క' మూవీ టీమ్‌ను అభినందించారు. వారితో దాదాపు గంటకుపైగా మాట్లాడారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం తన ట్విటర్‌ ‍ద్వారా పంచుకున్నారు. చిరంజీవితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుందని కిరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement