కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూవీ 'క'. తన్వీరామ్, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్‌ను శనివారం నిరవ్హించారు.
మనసుకు నచ్చితేనే..
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాసు మాట్లాడుతూ.. నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప ఇలాంటి వేడుకలకు రాను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేదు. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇది. ఈ సినిమాలో పనిచేసిన అందరికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను.
బడ్జెట్ విని షాకయ్యా..
సినిమా బడ్జెట్ విని షాకయ్యాను. వంశీ నందిపాటి నాకు రేట్ చెప్పకుండా సినిమా హక్కులు కొన్నాడు. ఆ నెంబర్ తెలిసి కంగారు పడ్డాను. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్ అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, చాలా కషపడ్డాడు.
పోరాటం ఆపలేదు
చాలా మంది కిరణ్ పడిపోయాడు.. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను పోరాటం ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేయడమే.. కానీ కిరణ్ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్ గెలిచాడు. కిరణ్‌ను చూస్తే ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. సక్సెస్ పాయింట్ వద్దకు వెళ్లే వరకు ఫైట్ చేయాలి. ఈ టీమ్ మరిన్ని విజయాలు అందుకోవాలి అని బన్నీ వాసు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment