బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో విన్నర్ అయ్యే లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? అంటే అది నిఖిల్‌కే అని బలంగా వినిపించింది. అందుకు తగ్గట్లుగానే అతడి ఆట ఉంటోంది. నాలుగైదు సార్లు మెగా చీఫ్ అవడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు కండబలం, బుద్ధి బలం రెండూ ఉండటం అతడికి ప్లస్. తను స్లో అయిపోతున్నాడని హౌస్‌మేట్స్ అంటున్నారు. కానీ టాస్కులు వస్తే చెలరేగిపోతాడు.
ఓటింగ్‌లో టాప్
తనంతట తానుగా ఏ గొడవలోనూ దూరడు. అందుకే ప్రతి వారం ఓటింగ్‌లో నిఖిల్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. కానీ ఈ వారం లెక్కలు మారాయి. నిఖిల్‌ను వెనక్కు నెట్టి ప్రేరణ మొదటి స్థానంలో ఉంది. నామినేషన్స్‌లో ఉన్నవారికంటే ప్రేరణకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయట! ఆటలో శివంగిలా పోరాడుతుంది. ఎవరి సపోర్ట్ లేకపోయినా సింగిల్‌గా ఫైట్ చేస్తుంది. ఈ మధ్య పృథ్వీ ఆమెను టార్గెట్ చేయడంతో తనపై కాస్త సింపతీ కూడా వర్కవుట్ అయింది.
టార్గెట్ వల్ల మేలు జరిగిందా?
గత సీజన్ హౌస్ అంతా కలిసి పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేశారు. కట్ చేస్తే అతడు విన్నర్ అయి కూర్చున్నాడు. ఈ సీజన్‌లో హౌస్ అంతా మణికంఠకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దీంతో ప్రతివారం నామినేషన్‌లో ఉన్నా సరే సేవ్ అవుతూ వచ్చాడు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక తనంతట తానే ఎలిమినేట్ అయ్యాడు. పోయినవారం నామినేషన్స్ డిసైడ్ చేసే పవర్స్ కిల్లర్ గర్ల్స్ హరితేజ, ప్రేరణకు లభించింది.
ఫైటర్
అప్పుడు పృథ్వీ, నయని ప్రేరణను ఆడనివ్వకుండా అడ్డుపడ్డారు. అప్పుడామె కన్నీళ్లు పెట్టుకుంటే కూడా హౌస్‌లో ఎవరూ తనను ఓదార్చలేదు, సపోర్ట్ చేయలేదు. చివరాఖరకు యష్మి సపోర్ట్‌గా నిలబడ్డప్పటికీ ఆమె మొసలి కన్నీళ్లను ఎవరూ నమ్మలేదు. మరి ప్రేరణ మున్ముందు వారాల్లోనూ ఓటింగ్‌లో ఇదే దూకుడు ప్రదర్శిస్తే బిగ్‌బాస్ విన్నర్ కావడం తథ్యం!
Comments
Please login to add a commentAdd a comment