గీత స్మరణం
పల్లవి :
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా...
ఇందుకేనా
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా (2)
మరచేవా ఎడబాసి మాయమయేవా (2)
॥
చరణం : 1
కన్నార చూసింది కలకలా నవ్వింది (2)
మనసార దరిజేరి మురిసిపోయింది
మనసైన పాట...
మనసైన పాట మన పూలబాట
మరచేవా ఎడబాసి మాయమయేవా
॥
చరణం : 2
నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు (2)
ఈ తీరై కన్నీరై కూలిపోయెనా
ఆకాశమేలే అలనాటి మన ఊహ (2)
ఈ తీరై కన్నీరై రాలిపోయెనా
॥
చరణం : 3
కనుల వెలుగు లేదు నీ పలుకు వినరాదు
మనసు నిలువలేదు నిన్ను మరువలేదు
భారమై విషమై రగిలే ఈ బ్రతుకెందుకో...
పల్లవి :
మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే (2)
చరణం : 1
చివురు మామిడి పందిళ్లనీడా
నిలిచింది చిలక నా కోసమే (2)
చివురింటి చిన్నదానా
నా దానవే నే నీవాడనే
॥
చరణం : 2
కనుల కాటుక కళ్యాణ తిలకం
నగుమోము కలకల నా కోసమే (2)
చిరునవ్వు చిన్నదాన
నా దానవే నే నీవాడనే
॥
చరణం : 3
పువ్వులు జల్లి పన్నీరు జల్లి దీవించి మీ వారు పంపేరులే పువ్వులు జల్ల్లి పన్నీరు జల్లి దీవించి మీ వారు పంపేరులే
మనసైన చిన్నదానా మీ ఇంటికి మా ఇంటికీ
॥
చిత్రం : చిరంజీవులు (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం, గాన ం : ఘంటసాల