
గీత స్మరణం
సాకీ :
ఓ ధర్మదాతా... ఓ ధర్మదాతా!
పల్లవి :
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీతోడు రారు
అడిగిన వారికి లేదనక (2)
అర్పించిన ఓ ధర్మదాతా
॥
చరణం : 1
సగము దేహమై నిలిచిన నీ దేవి
రగిలే చితిలో రాలింది
పుట్టెడు మమతలు పండించు ఇల్లాలు
పిడికెడు బూడిదగా మారింది
ముత్తైవుగా ముగిసిన సతి మేను (2)
కృష్ణవేణిగా మిగిలింది (2)
॥
చరణం : 2
కల్పతరువుగా వెలసిన భవనం
కడకు మోడుగా మారేనా
కోటి దివ్వెలను నిలిపిన నీకే
నిలువ నీడయే కరువాయెనా
పూవులమ్ముకొని బ్రతికే చోట (2)
కట్టెలమ్ముకొను గతి పట్టెనా
ఓ ధర్మదాతా... ఓ ధర్మదాతా!
పల్లవి :
ఎవ్వడికోసం ఎవడున్నాడు
పొండిరా పొండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి
॥
చరణం : 1
ఉన్నవాడిదే రాజ్యమురా
లేనివాడి పని పూజ్యమురా
మనుషులలోన మమతలు లేవు
మంచిత నానికి రోజులు కావు (2)
అంతా స్వార్థం జగమంతా స్వార్థం
॥
చరణం : 2
ఒకడికి నే తలవంచనురా
బానిసగా జీవించనురా
మిన్ను విరిగి పైబడినా కాని
అవమానాన్ని సహించనురా
ఒరేయ్... ఉంటే వేళకు తింటా
లేకుంటే పస్తులు ఉంటా...
ఒరేయ్ ఒరేయ్
మిమ్ము నమ్ముకుని పుట్టానా...
మీరుద్ధరింతురనుకున్నానా (2)
పోతున్నారా వెళ్లిపోతున్నారా...
॥
చరణం : 3
కాలం మారకపోతుందా
కష్టం తీరకపోతుందా
అదృష్టమన్నది ఇంటికి వచ్చి
తలుపులు తట్టకపోతుందా
అప్పుడు మీరేమంటారు
మా నాన్నే... మా నాన్నే...
మా బాబే... అంటూ
నీడకు చేరే పక్షుల్లాగా...
బెల్లం చుట్టూ ఈగల్లాగా
మూగకపోరూ నే చూడకపోనూ
॥
చిత్రం : ధర్మదాత (1970), రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.చలపతిరావు, గానం :ఘంటసాల
నిర్వహణ: నాగే్‌శ