మెదక్ మున్సిపాలిటీ: ‘జన్మనిచ్చింది మా తల్లిదండ్రులైతే.. రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్’ అని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ఉపసభాపతి జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఆడబిడ్డగా ఆదరించి ఆశీస్సులు అందజేసిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు.
ఆమెకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే... రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి పనులు చేస్తూ పాలన కొనసాగిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ... అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు అన్ని హంగులతోకూడిన మెదక్ నియోజకవర్గాన్ని అందిస్తానని తెలిపారు.
జన్మదిన వేడుకలు ఇలా...
ఉదయం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అక్కడ కేక్‌కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘనంగా సన్మానించారు. పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అంతకు ముందు బాణాసాంచా కాల్చి స్వాగతం పలికారు. కౌన్సిలర్ మాయ మల్లేశం తయారు చేయించిన 50 కిలోల కేక్‌ను ఆమె కట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి రక్తదానం చేశారు. ఆయనతో పాటు ఈ శిబిరంలో 70మంది వరకు రక్తదానం చేశారు.
శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నగేశ్, డీఆర్వో రాములు, ఆర్డీఓ మెంచు నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మెదక్ పట్టణ సీఐ భాస్కర్, రూరల్ సీఐ రామకృష్ణ, ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ ఈఈ, డీఏఓ పరశురాం, స్త్రీశిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి జ్యోతిపద్మ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన సంబురాలు..
ఆటోనగర్, ఖాజా ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌వద్ద, పాత బస్టాండ్ వద్ద, మున్సిపల్ కార్యాలయంలో, జిల్లా గ్రంథాలయ సంస్థలో, జేఎన్ రోడ్డులో మేరు సంఘం ఆధ్వర్యంలో, 3, 4వ వార్డుల్లో, రాందాస్ చౌరస్తాలో, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, డాన్ బాస్కో హైస్కూల్‌లో , హోటల్ చంద్ర భవన్ వద్ద , హోటల్ బావర్చి ఆధ్వర్యంలో, ఎస్టీ బాలికల వసతి గృహంలో అంగరంగ వైభవంగా పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదిన వేడకలను నిర్వహించారు. పలు చోట్ల అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. హోటల్ చంద్రభవన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చీరలను పంచి పెట్టారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు అనిల్‌కుమార్, రబ్బీన్ దివాకర్, మధుసూదన్‌రావు, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, సులోచన, యశోద, రాధ, కౌన్సిలర్ సోహైల్, కో అప్షన్ సభ్యులు గంగాధర్, సాధిక్, జీవన్‌రావు, కిరణ్‌గౌడ్, టీఎన్జీఓస్ నాయకులు భూపాల్‌రెడ్డి, శ్యాంరావు, జెల్ల సుధాకర్, నరేందర్, సువర్ణ, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా నరేందర్, గడ్డమీది కృష్ణాగౌడ్, వైస్ ఎంపీపీ లలితవిశ్వం, ఫాజిల్, శ్రీకాంత్ తదితరులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నశంకరం పేటలో హోమం..
చిన్నశంకరంపేట(మెదక్): డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీఅనంతపద్మనాభస్వామి గుట్టపై సర్పంచ్ కుమార్‌గౌడ్ అధ్వర్యంలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీఅనంతపద్మనాభస్వామి, శివలింగాలకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను ఆమె కట్‌చేశారు.
అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేగుంట నుంచి భారీ బైక్ ర్యాలీతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రాగౌడ్, కృపావతి, విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు మైనంపల్లి రంగారావు, సాన సత్యనారాయణ, సుధాకర్, సిద్దాగౌడ్, పడాల సిద్దిరాములు, టీఆర్‌ఎస్ నాయకులు రామ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వడ్ల శ్రీనివాస్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్, తహసీల్దార్ సహదేవ్‌లు బోకేలను శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment