
గురువారం సుకుమార్ బర్త్‌డే. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో
అది ‘రంగస్థలం’ సినిమా సెట్! హీరో రామ్‌చరణ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ అక్కడే ఉన్నారు. వీరందిరినీ డైరెక్టర్ సుకుమార్ చూస్తూనే ఉన్నారు. ఆయన స్టార్ట్ చెప్పారు. కానీ సీన్ అయినా కట్ చెప్పకుండా చెమర్చిన కళ్లతో చూస్తూ ఉండిపోయారు. యూనిట్ అందరి కళ్లల్లో కన్నీరు. చిట్టిబాబు (‘రంగస్థలం’లో రామ్‌చరణ్ పేరు) అయితే పట్టరాని దుఃఖంలో ఉన్నాడు. ఏమైంది? ఎందుకలా? అంటే.. ఈ సినిమాలో ఓ కీలకమైన సెంటిమెంట్ సీన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. ఈ హై ఎమోషన్ సీన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పాట వస్తుంది.
ఆ పాట, వీళ్ల వేదన చూస్తే ఎవరైనా ఇట్టే కరిగిపోవాల్సిందే. ఆ రేంజ్‌లో ఉందట. సీన్ నిజం కాదని తెలిసినా.. లొకేషన్లో అందరూ ఎమోషనల్ అయ్యారంటే.. రేపు థియేటర్లో ప్రేక్షకుల కళ్లు చెమర్చకుండా ఉండవు. ఆన్ సెట్ ఎమోషన్ అయినా ఆఫ్ సెట్ మాత్రం ఈ యూనిట్ సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉంటున్నారు. నవీన్, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment