అఫీషియల్‌: 200 కోట్ల క్లబ్‌లో రంగస్థలం | Ram Charan Rangasthalam in 200 Crore Club | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 8:54 AM | Last Updated on Tue, May 1 2018 1:08 PM

Ram Charan Rangasthalam in 200 Crore Club - Sakshi

రంగస్థలంలో రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరిపోయింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చి 30న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్‌లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్‌-బాహుబలి) నిలిచింది. 

సౌండ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబుగా రామ్‌ చరణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. పొలిటికల్‌ విలేజ్‌ డ్రామాను దర్శకుడు సుకుమార్‌ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌, పాటలకు సాహిత్యం, ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ఇప్పటిదాకా ఇది హయ్యెస్ట్‌ గ్రాసర్‌ కావటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement