అనసూయ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. గత వారం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. రాంచరణ్, సమంతతో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అనసూయ ఆనందం పట్టలేకపోతోంది. సినిమాకు ఊపిరిలాంటి అంత గొప్ప క్యారెక్టర్‌ని తనకిచ్చినందుకు సుకుమార్‌కి ఆమె కృతజ్ఞలు తెలిపారు కూడా.
చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా.. రంగస్థలం టీంకు విందు భోజనం ఇచ్చింది. రంగస్థలం అసిస్టెంట్ డిజైనర్ గౌరీ నాయుడు ‘రంగమ్మత్త విందు భోజనం’ అంటూ అందరూ కలిసి ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘రంగమ్మత్త విందు భోజనం.. మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు’ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ ట్వీట్‌కు అనసూయ ‘సచ్ లవ్‌లీ టైమ్’ అని సమాధానమిస్తూ రీట్వీట్ చేసింది. రంగస్థలం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్న ఈ ఫొటో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంతో రంగస్థలం తెరకెక్కిన విషయం తెలిసిందే.
Rangammatta Vindhu Bhojanam ❤️ @anusuyakhasba 😘
— Gauri Naidu (@Gauri_Naidu) April 5, 2018
Ma Rangasthalam gramasthulu mariyu ma president gari sannihithulu 😛 #Rangasthalam #RangasthalamMemories 😎 pic.twitter.com/DfMKngaLjB
Hahaha❤️❤️ Such lovely time!!! https://t.co/duOPz2WwmD
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 6, 2018
Comments
Please login to add a commentAdd a comment