
సాక్షి, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద జూన్ 28న ప్రధాన కార్యక్రమం జరగనుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతకంటే ముందు నెక్లెస్‌రోడ్‌లో పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
వందేళ్లు
1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లిలో అమ్మమ్మ ఇంట పీవీ జన్మించారు. ఆ తర్వాత ఆయన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పెరిగారు. రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎంగా ఇండియా ప్రధానిగా విశేష సేవలు అందించారు. ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత గ్రామం వంగరతో పీవీకి ఎనలేని అనుబంధం ఉంది. ఇప్పటికీ పీవీ జ్ఙాపకాలు అనేకం అక్కడ పదిలంగా ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం సాక్షి ప్రత్యేకంగా అందిస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి : వినూత్న ప్రయత్నం: స్టాంపులపై సాహితీ ముద్ర
Comments
Please login to add a commentAdd a comment