PV narasimharao
-
పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు పీవీ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో దేశానికి పీవీ చేసిన సేవలను ప్రశంసించారు. ఇక, పీవీ ఘాట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘తెలుగు వారికి, తెలంగాణకు, భారత దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహారావు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత్‌ను గాడిలో పెట్టి తన వంతుగా దేశానికి సేవలు అందించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి. ఢిల్లీలో పీవీ ఘాట్‌ను నిర్మించాలి. భారతరత్న ఇచ్చి పీవీని గౌరవించాలి. పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో ఆయన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాయి. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఆయన వర్థంతి సభకు బీఆర్ఎస్ రాకపోవడం బాధాకరం’ అని విమర్శించారు. -
పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య గొడవ.. దాని కోసమే !
ఓ వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు అడుగంటిపోయిన విదేశీ మారక ద్రవ్యం. దేశ దిగుమతి అవసరాలు తీరాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ క్షణంలో ప్రధానీ పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు ఎంతో ధైర్యంగా 1991 జులై 24న ఆర్థిక సంస్కరణల అమలు చేయబోతున్నట్టు బడ్జెట్లో తెలిపారు. నేటితో ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. కఠినమైన కాలం 1991లో ఇండియా ఆర్థికంగా కుదేలైన సమయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సాయాన్ని భారత ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లో చాలా కఠిన నిబంధనలను ఐఎంఎఫ్ పొందు పరిచింది. ఒక్క అక్షర ముక్క కూడా మార్చడానికి వీలు లేదన్నట్టుగా ఐఎంఎఫ్ భీష్మించుకుని కూర్చుంది. చివరకు అగ్రిమెంట్లో లేబర్ అన్న చోట LOBOR అంటూ అమెరికన్ పద్దతిలో రాస్తే కనీసం మన పరిస్థితులకు తగ్గట్టు LOBOUR గా అయినా మార్చాలంటూ కోరింది భారత ప్రభుత్వం. కనీసం స్పెల్లింగ్ మార్చే స్థితిలో కూడా అప్పటి భారత ప్రభుత్వం లేదు. అలాంటి స్థితి నుంచి ట్రిపుల్ బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి బీజం వేసిన ఇద్దరు వ్యక్తులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు. అయితే ఆర్థిక సంస్కరణలకు అమలు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ ? పీవీ, మన్మోహన్ ద్వయం ఎలా మార్కెట్‌ని ఓపెన్ చేశారనే వివరాలను అప్పుడు పీవీకి సహాయకుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఆఫ్ లయన్ పేరుతో పీవీ బయోగ్రఫీ రాసిన వినయ్ సీతాపతిలు ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వివరాలు మీకోసం.. రూపాయి విలువ తగ్గింపు 1991 జున్ 21న ప్రధానిగా పీవీ నరసింహరావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిందే ఆలస్యం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగా జూన్ చివరి వారంలోనే రూపాయి విలువ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ ప్రతిపాదించారు. ఈ విషయంలో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రూపాయి విలువ తగ్గిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని పీవీ వాదన, గతంలో 1966లో ఇందిరాగాంధీ ఇదే ప్రయత్నం చేసి చేదు ఫలితాలు చూశారు. అయితే విలువ తగ్గిస్తేనే మార్కెట్ పుంజుకుంటుందనేది మన్మోహన్ సింగ్ అభిప్రాయం. చివరకు రాజకీయ ఆటుపోట్లు తాను ఎదుర్కొంటానని చెబుతూ మన్మోహన్ సింగ్ నిర్ణయానికే ప్రధానీ పీవీ మద్దతు ఇచ్చారు. అభిప్రాయ బేధాలు రూపాయి విలువ తగ్గింపును రెండు అంచెల్లో ప్రవేశపెట్టనేది మన్మోహన్ సింగ్ వ్యూహం. ఒక్కసారి తగ్గింపుకే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతుంటే రెండు సార్లు తగ్గించడం ఎందుకంటూ పీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటిసారి తగ్గింపు మార్కెట్‌ను పరీక్షించేందుకని, ఆ ఫలితాలను బట్టి అసలైన నిర్ణయం రెండోసారి అంటూ మన్మోహన్ వివరణ ఇచ్చారు. అయినా సరే పీవీ సంతృప్తి చెందలేదు. ఆర్బీఐ అధికారులకు ఫోన్ చేసి రూపాయి విలువ తగ్గించవద్దంటూ కోరారు. అయితే అప్పటికే రూపాయి విలువ తగ్గిస్తున్నట్టు మార్కెట్‌కి చెప్పేశామంటూ అటు నుంచి బదులు వచ్చింది. ఫలితంగా అయిష్టంగానే మన్మోహన్ సింగ్ వ్యూహానికి పీవీ మద్దతు పలకాల్సి వచ్చింది. ఇలా ప్రధాని, ఆర్థిక మంత్రిల మధ్య అభిప్రాయ బేధాలతోనే ఆర్థిక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. మరో రెండు నిర్ణయాలు రూపాయి విలువ తగ్గించడంతోనే ఈ ద్వయం ఆగిపోలేదు. 1991 జులై మొదటి వారంలో కొత్త ట్రేడ్ పాలసీని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఎగుమతులను హేతుబద్ధీకరించడంతో పాటు ప్రోత్సహకాలు పెంచారు. అనంతరం ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో అప్పటి వరకు పారిశ్రామికవేత్తలను వేధిస్తూ వచ్చిన బ్యూరోక్రసీలో ఉండే రెడ్టెపిజానికి అడ్డుకట్ట వేశారు. దీంతో లైసెన్సులు త్వరగా వచ్చేలా మార్పులు చేసి, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులు సరళీకృతం చేశారు. ముందుమాటతో ఆర్థిక సంస్కరణలను వామపక్షాలు ముందు నుంచి తప్పుపడుతూనే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీలకు సంబంధించి స్వపక్షం నుంచే పీవీకి సవాల్ ఎదురైంది. కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలెవరు పీవీకి అండగా నిలవలేదు. ముసాయిదా డ్రాఫ్ట్లని రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులుగా పడ్డ కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. చివరకు ‘పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది’ అంటూ ముందు మాటను చేర్చారు. డ్రాఫ్ట్‌లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు. కానీ ఈ ఒక్క ముందుమాటతో అప్పటి వరకు ముసాయిదాను వ్యతిరేకించిన మంత్రులంతా శభాష్ అంటూ ప్రధాని పీవీ, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్‌లను మెచ్చుకున్నారు. అలా గండం గట్టెక్కి పార్లమెంటు ముందుకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు. పీవీ నేర్పు ఆర్థిక సంస్కరణల అమలును ఎప్పటిలాగే విపక్షాలు తప్పు పట్టాయి. పీవీపై తీవ్రమైన దాడి చేశాయి. పార్టీ నేతల నుంచి ఆశించిన సహకారం రాలేదు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వినాశకాలే సముత్ పన్నే.. అంటూ చెప్పిన సంస్కృత పద్యంతో బీజేపీ నేతలు పీవీని అర్థం చేసుకుని మాటల దాడి తగ్గించారు. ఆ తర్వాత పని సులువుగా జరిగిపోయింది. నిజానికి ప్రైవేటీకరణ అనే మాటను ఉపయోగించకుండానే ఎంతో నేర్పుగా పీవీ వ్యవహరించారు. పీవీ చాణక్యం పీవీ తన రాజకీయ జీవితంలో కేంద్రంలో రక్షణ, విదేశీ వ్యవహరాలు, మానవ వనరులు, ఆరోగ్యశాఖలను నిర్వహించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసినా తనదైన ముద్ర వేయలేకపోయారు. భూసంస్కరణలు మధ్యలో ఆగిపోతే జై ఆంధ్ర ఉద్యమ సెగలు చవిచూడాల్సి వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ దేశంపై తన ముద్ర వేయగలిగారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారు. అస్థిర ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో మైనార్టీ ప్రభుత్వంతో ఎవ్వరూ సాహసించలేని నిర్ణయాలను అమలు చేయగలిగారు. భవిష్యత్ దర్శనం 1991 జులై 24న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలు వాస్తవ రూపం తీసుకున్నాయి.. ‘సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలోనే ఇండియాను ఆర్థిక శక్తిగా నిలిపే చర్యలు తీసుకుంటున్నాం. అమలు చేయడమేది ముళ్ల బాట వంటిది. అయినా సరే ఆ పని చేసి తీరుతాం. ఈ పని చేసినందుకు భవిష్యత్తు తరాల వారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహరావుని గుర్తు పెట్టుకుంటారు’ అని తెలిపారు. ఈ రోజు దేశం మొత్తం పీవీ, మన్మోహన్ సింగ్‌లని స్మరించుకుంటోంది. - సాక్షి, వెబ్‌డెస్క్ -
‘మా కంపెనీలో అటెండర్ షేర్ల విలువ రూ.15 కోట్లు’
30 Years Of Economic Reforms.. సాక్షి, వెబ్‌డెస్క్: అనుమతులు, ఆంక్షలు, రెడ్ టేపిజంల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి జులై 24తో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ద్వయం అమల్లోకి తెచ్చిన ఈ సంస్కరణల ఫలితాలు అందిపుచ్చుకుని ఎదిగిన సంస్థల్లో మేటీగా నిలిచిన వాటిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇన్ఫోసిస్ ఎదుగుదల గురించిన వివరాలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ విశేషాలు మీ కోసం... కలలు నిజమయ్యాయి 1991 జులై 21న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాతే మేము కన్న కలలన్నీ నిజం అయ్యాయి. నా దృష్టిలో ఎంటర్ప్రెన్యూర్ అంటే తనకు వచ్చిన ఐడియా ఎండ్ యూజర్‌కి ఉపయోగకరంగా ఉండాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వాలి, పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలి. అయితే ఆర్థిక సంస్కరణలకు ముందు ఇవన్నీ జరిగేందుకు ప్రతీ చోట అనుమతులు అనే అడ్డంకులు ఉండేవి. కానీ ఆర్థిక సంస్కరణలు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఎంటర్ప్రెన్యూర్లు తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి సులువైన దోవ దొరికింది. అంతకు ముందు కంప్యూటర్లు కొనడమనేది ఎంతో కష్టమైన వ్యవహారంగా ఉండేది. కంప్యూటర్లు కొనాలంటే 1981 జులైలో ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించిన కొత్తలో ఐబీఎం 4342 కంప్యూటర్లు కొనేందుకు మూడేళ్లలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ కంప్యూటర్లు వచ్చేవి కాదు. ఇలా మేము ఎదురు చూపుల్లో ఉంటుండగా.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించి ప్రతీ ఆరు నెలలకు అమెరికాలో మార్పులు వచ్చేవి. ప్రతీ ఆరు నెలలకు కొత్త కంప్యూటర్లు అక్కడ మార్కెట్లోకి వచ్చేవి. పైగా పాత కంప్యూటర్‌తో పోల్చితే యాభై శాతం మెరుగైన పనితీరు, 30 శాతం తక్కువ ధరతో కొత్త కంప్యూటర్లు వచ్చేవి. దీంతో మళ్లీ ఆర్డర్లలో మార్పులు చేయాల్సి వచ్చేది. వాటికి త్వరగా అనుమతులు సాధించడం మరో ప్రహసనంగా ఉండేది. ఒక్క కంప్యూటరనే కాదు ఆఖరికి టెలిఫోన్ పొందాలన్నా కష్టమే. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు, లేదా రిటైర్డ్ అధికారుల ఇళ్లకే కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నిధుల సమస్య ఆరోజుల్లో టెలిఫోన్ కనెక్షన్, కంప్యూటర్లు కొనేందుకే ఇబ్బంది పడే మాకు నిధుల సేకరణ పెద్ద సమస్యగా ఉండేది. ఇక బ్యాంకులకు సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్‌పోర్ట్స్ గురించి ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు, పెట్టుబడిదారులు మా వైపు చూసేవారు కాదు. ఇలా కంపెనీ స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు బాలారిష్టాలనే ఎదుర్కొన్నాం. ఆ సమయంలోనే మా కంపెనినీ రూ. 2 కోట్లకు కొంటామంటూ ఆఫర్ వచ్చింది. ఫౌండర్లలో కొందరు అమ్మేద్దామనుకున్నారు కూడా. కానీ ఈ రోజు కంపెనీ విలువ 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఎదుగుదలకు ఆర్థిక సంస్కరణలు ఎంతగానో తోడయ్యాయి. ఐపీవోకి 1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగం పెరిగింది. అనుమతుల కోసం వేచి చూసే సమయం తగ్గింది. విదేశాల నుంచి ఎదైనా తెప్పించుకోవడం తేలికైంది. ఈ సంస్కరణలు ఇచ్చిన ధైర్యంతో 1992 డిసెంబరులో ఇన్ఫోసిస్ స్థాపించిన పదేళ్లకు స్టాక్ మార్కెట్‌కి వచ్చాం. నందన్ నీలేకని, బీ బాలకృష్ణన్, వీఆర్ నాయక్‌లు కంపెనీ టార్గెట్, రిస్క్‌లను వివరిస్తూ మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు. అదే సమయంలో ఇనామ్ వ్యవస్థాపకులు వల్లభ్ బన్సాలీ, నేమీష్ షాలు సహకారం అందించారు. స్టాక్ మార్కెట్‌కి రక్షణగా 1992లోనే సెబీ కూడా ఏర్పాటైంది. దీంతో ఇన్ఫోసిస్‌కు నిధుల సమస్య క్రమంగా దూరమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాం. షేర్ వాల్యూ అత్యంత కింది స్థాయి ఉద్యోగి సంక్షేమం, అభివృద్ధి లక్క్ష్యంగా కంపెనీ పనితీరు ఉండాలని మహ్మాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో 1994, 1998లో ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ)ని అమలు చేశాం. మంచి ప్రతిభ కనబరిచిన ప్రతీ ఉద్యోగికి అటెండర్, ప్యూన్ నుంచి డైరెక్టర్ల వరకు షేర్లు కేటాయించాం. ఈ షేర్టు అట్టి పెట్టుకున్న చాలా మంది అటెండర్లు, ఫ్యూన్లు కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారు. 1994, 1998 ప్లాన్‌లో లేని ఎంప్లాయిస్ కోసం కనీసం పది షేర్ల వంతున 2008లో కేటాయించాం. ఇప్పుడు ఆ షేర్ల విలువల 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడా ఉద్యోగులు ఆదాయపు పన్ను కడుతున్నారు, చూడచక్కని ఇళ్లు కట్టకున్నారు, మంచి కార్లలలో తిరుగుతున్నారు. సెలవుల్లో కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు. ఈ మార్పు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. విలువలతో.. దేశ బంగారు భవిష్యత్తు కొత్తతరం ఎంట్రప్యూనర్లపైనే ఆధారపడి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పోటీ తత్వంతో పాటు విలువలు పాటించే లక్షణం కూడా ఉండాలి. పవర్ బై ఇంటెలెక్ట్ డ్రైవెన్ బై వాల్యూస్ అనేది ముఖ్యం. అదే విధంగా మన దగ్గర జనాభా ఎక్కువ. కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష, ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియా భాష. ఆ భాషపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా మన దగ్గర బోధన జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా విద్యావిధానంలో మార్పు రావాలి. ఉద్యోగాలు సృష్టించే స్టేట్స్, ఎగుమతులు పెంచే స్టేట్స్‌కి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందివ్వాలి అప్పుడు మన సమాజం మరింతగా ముందుకు వెళ్తుంది. -
పీవీ ఒక కీర్తి శిఖరం, ఆయనను ఎంత స్మరించుకున్న తక్కువే: కేసీఆర్
-
‘అతి తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన వ్యక్తి పీవీ’
సాక్షి, ముంబై: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాయకులు, ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర, పీవీని గుర్తు చేసుకుంటూ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. 91 నాటి ఆర్థిక సరళీకరణకు సంబంధించిన అందరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి ఈ గౌరవం దక్కల్సింది పీవీ నరసింహరావుకు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్ర సోమవారం ట్వీట్ చేశారు. దీనిలో ఆనంద్ మహీంద్ర టైమ్స్ ఆఫ్ ఇండియాలో పీవీ మీద వచ్చిన కథనానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘నా సోమవారం మోటీవేషన్ తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన ఈ వ్యక్తిని గుర్తు చేసుకోవడంతో ప్రారంభమైంది. సాధారణంగా దేశ రూపురేఖలు మార్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలకు సంబంధించి అందరు మన్మోహన్ సింగ్‌ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి ఆ సంస్కరణలు ఆచరణలోకి రావడం వేనక పీవీ ధైర్యం, తెగువ ఉన్నాయి. కానీ ఆయనకు తక్కువ గుర్తింపు దక్కింది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. My #MondayMotivation is through remembering this man—who’s not just under-rated, but under-appreciated. Shri Manmohan Singh is usually credited for the ‘91 reforms that transformed India. But in reality the pressure & courage for those reforms came from Shri P.V.Narasimha Rao 🙏🏽 https://t.co/oDJJZXM8Jr — anand mahindra (@anandmahindra) June 28, 2021 చదవండి: పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం: సీఎం కేసీఆర్ -
హైదరాబాద్: పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
పీవీ ఒక కీర్తి శిఖరం: సీఎం కేసీఆర్
కడుపు నిండిపోయింది... తెలంగాణ బిడ్డ పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేయడం సంతోషం. భవిష్యత్తులో అనేక పథకాలకు పీవీ పేరు పెట్టుకుందాం. – సీఎం కేసీఆర్ పీవీ ఓ విద్యానిధి... పీవీ తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ ఏ పాత్ర పోషించినా సంస్కరణలకు పెద్దపీట వేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేశారు. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలో చదివిన డీజీపీ మహేందర్‌రెడ్డి తరహాలో ఎంతో మంది పీవీని ప్రతినిత్యం స్మరించుకుంటారు. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. కవి పండితుడు, బహుభాషా కోవిదుడు, సమున్నత సాహితీ స్ఫూర్తి. ఆయన వల్లే పెట్టుబడులు... దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నర్సింహారావు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. విదేశీ మారక నిల్వలు తరిగి బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులను సవాలుగా తీసుకుని చేపట్టిన సంస్కరణలతో ఇప్పుడు దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. – సీఎం కేసీఆర్ ఒక గొప్ప ఆభరణం... నెక్లెస్ రోడ్‌కు పీవీ విగ్రహం ఒక గొప్ప ఆభరణం. ఈ భూమి పుత్రుడికి దక్కిన గౌరవం. పీవీ కాంగ్రెస్‌కు చెందిన వాడైనా తన ఆత్మకథను ఆవిష్కరించే అవకాశం మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చారు. మానవ హక్కులపై ఐక్య రాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం కూడా వాజ్‌పేయికి కల్పించారు. – గవర్నర్ తమిళిసై సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు ఒక కీర్తి శిఖరం.. ఒక దీప స్తంభం.. పరిపూర్ణ సంస్కరణశీలి. ఆయనను ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా, ఎంత సన్మానించుకున్నా తక్కువే’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలసి సీఎం సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్) లోని జ్ఞానభూమిలో నిర్వహించిన పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నా ఏడాది కాలం గా రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించిందని ముఖ్యమంత్రి చెప్పారు. భూ సంస్కరణలకు మార్గదర్శకం ‘పీవీ చేపట్టిన భూ సంస్కరణలను ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. తనకున్న 800 ఎకరాల భూమిని ప్రజలకు ధారాదత్తం చేసి నిబద్ధ తను చాటుకుంటూ భూ సంస్కరణలు అమలు చేశారు. పీవీ స్మరణ, స్ఫూర్తిని భావితరాలకు చాటే లా కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నం. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుంది. పీవీ అనేక పుస్తకాలు రాయడంతో పాటు రచనలను అధ్యయనం చేశారు. ఆయన ఆర్థిక సంస్కరణలతో నే దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి. మాజీ ప్రధా ని మన్మోహన్సింగ్ కూడా పీవీని తండ్రిగా, గురువుగా స్మరించుకునేవారు’అని కేసీఆర్ అన్నారు. సోమవారం పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్. చిత్రంలో కె.కేశవరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పుట్టిన, పెరిగిన ఊరులో విగ్రహాలు.. ‘పీవీ పుట్టిన, పెరిగిన ఊరు, ఇతర చోట్ల విగ్రహావిష్కరణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీవీ సమాధి ఉన్న జ్ఞానభూమిలోనూ న్యాయపరమైన చిక్కులు లేకుండా స్మారకం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబాన్ని గౌరవించుకునేందుకు ఆయన కుమార్తె సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన ఆదర్శాలు, సంస్కరణశీల భావజాలాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహద పడటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి’అని సీఎం అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు పీవీ: కేటీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ యంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పీవీ అభివృద్ధి పథంలో నిలిపారని పేర్కొన్నారు. ఆయన గొప్ప దార్శనికుడు, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. అరుదైన వ్యక్తిత్వం..: గవర్నర్ ‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మహానేత, బహుముఖ ప్రజ్ఞాశాలి. పేద ప్రజల పెన్నిది. సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త’అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ‘ఆయనను నేను ఎంతో గౌరవిస్తా. పీవీపై రూపొందించిన పుస్తకాలు వచ్చే తరాలకు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం పీవీది. పీవీ రాజకీయాలకంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించారు అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు అక్షర సత్యం. ప్రధాని మోదీ చెప్పినట్లు పీవీ దేశ ఆత్మను, విలువలను ప్రేమించారు. దక్షిణ భారతదేశం నుంచి ఆయన మొదటి ప్రధాని కావడం గర్వకారణం. పీవీ విజయాలను చూసి తెలంగాణ తల్లి ఎంతో సంతోషిస్తోంది’అని గవర్నర్ తమిళిసై అన్నారు. పీవీ విగ్రహం, పుస్తకాల ఆవిష్కరణ.. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌ను ‘పీవీ మార్గ్’గా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళి అర్పించగా.. కీర్తనలు, సర్వ మత ప్రార్థనలు జరిగాయి. ఏడాది కాలంగా జరిగిన పీవీ శత జయంతి వేడుకల కార్యక్రమాలను ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే.కేశవరావు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. -
పీవీ స్వగ్రామం వంగరలో పీవీ జ్ఞాపకాలు పదిలం
-
పీవీ రాసిన డైరీలో... ఏముందో ?
సాక్షి, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద జూన్ 28న ప్రధాన కార్యక్రమం జరగనుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతకంటే ముందు నెక్లెస్‌రోడ్‌లో పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వందేళ్లు 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లిలో అమ్మమ్మ ఇంట పీవీ జన్మించారు. ఆ తర్వాత ఆయన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పెరిగారు. రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎంగా ఇండియా ప్రధానిగా విశేష సేవలు అందించారు. ఎంత ఎత్తుకి ఎదిగినా సొంత గ్రామం వంగరతో పీవీకి ఎనలేని అనుబంధం ఉంది. ఇప్పటికీ పీవీ జ్ఙాపకాలు అనేకం అక్కడ పదిలంగా ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం సాక్షి ప్రత్యేకంగా అందిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : వినూత్న ప్రయత్నం: స్టాంపులపై సాహితీ ముద్ర -
Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా..
భీమదేవరపల్లి: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని హుజురాబాద్ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే స్థానిక ప్రజలను టీఆర్ఎస్కు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్న వాదన సైతం ఉంది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్‌ను ప్రకటించే అవకాశాలు సైతం లేకపోలేదని తెలుస్తోంది. వంగరలోని పీవీ విగ్రహం పట్టించుకోని నాయకులు పీవీ మరణానంతరం సొంత పార్టీ నాయకులే ఆయనను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే దక్షాణాది రాష్ట్రాల నుంచి అత్యున్నతమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పీవీపై టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటుగా రూ.11కోట్ల వ్యయంతో పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ స్మృతివనం, భీమదేవరపల్లి కస్తూరీబాగాంధీ పాఠాశాల నుంచి వంగర వరకు డబుల్ బీటీ రోడ్డు, ఆర్చీ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈనెల 28న పీవీ శతజయంతి నేపథ్యంలో వంగరలోని పోలీస్‌స్టేషన్ ఎదుట పీవీ స్మృతివనం పనులు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే పీవీ నివాస గృహాన్ని వారి కుటుంబ సభ్యులు ఆధునీకరించడంతో పాటుగా పీవీ ఉపయోగించిన వస్తువులను హైదరాబాద్ నుంచి వంగరకు తరలించి భద్రపరిచారు. వాటిని పీవీ ఇంట్లో ఏర్పాటు కానున్న మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. 12 మండలాలతో నూతన జిల్లా.. కాగా హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు 12 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీవీ గ్రామమైన వంగరకు 8 కిలోమీటర్ల దూరంలోని హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించి అందులోకి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శం కరపట్నం, సైదాపూర్, చిగురుమామిడితో పాటుగా భీమదేవరపల్లి మండల పరిధిలోని పీవీ స్వగ్రామం వంగర, వీరభద్రస్వామి దేవస్థానం కల్గిన కొత్తకొండను మండలాలుగా ఏర్పాటు చేసి మొత్తం 12 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. వంగరలోని పీవీ ఇల్లు శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించే అవకాశం ఈనెల 28న జరగనున్న పీవీ శతజయంతి ఉత్సవాల్లో హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఈటలకు చెక్ పెట్టడంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీలో నెలకొంది. అయితే ఇప్పటికే పీవీ కూతురు సురభి వాణీదేవీకి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలకు వంగరకు సీఎం కేసీఆర్ హాజరై జిల్లా ప్రకటనతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధిపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు, రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీక్షకు సిద్ధమవుతున్న గ్రామస్తులు అయితే పీవీ పేరిట జిల్లా ఏర్పాటుతో పాటుగా వంగరను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కండె రమేశ్, కండె చక్రపాణి, కండె సుధాకర్ తదితరులు దీక్షకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు కొత్తకొండను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చెప్యాల ప్రకాశ్, ఉప్పుల కుమారస్వామి, సిద్దమల్ల కృష్ణ తదితరులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం -
పీవీకి భారతరత్న పురస్కారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్ర«ధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాష్ట్ర అసెంబ్లీ కోరింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టాలని, హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి స్వల్ప కాలిక చర్చను ప్రారంభించారు. పీవీ దార్శనికతను కొనియాడుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఉటంకిస్తూ ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల తరఫున మల్లు భట్టి విక్రమార్క, కేటీఆర్, సత్యవతి రాథోడ్, రాజాసింగ్, గంగుల కమలాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, శ్రీధర్ బాబు, శ్రీనివాస్‌గౌడ్, రెడ్యానాయక్‌లు ప్రసంగించి సీఎం ప్రవేశపెట్టిన తీర్మా నానికి మద్దతు తెలిపారు. ఎంఐఎం తరఫున ఎవరూ చర్చలో పాల్గొనలేదు. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతి వ్వడంతో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమో దించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. తీర్మాన ప్రసంగంలోసీఎం ఏమన్నారంటే... ‘దేశ ప్రధాని కాగలిగే అవకాశం చాలా తక్కువ మందికి లభించే గొప్ప అవకాశం. వ్యక్తిగత ప్రతిభ, అకుంఠిత దీక్ష ద్వారా మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఈ పదవి దక్కింది. కానీ ఆయనకు లభించాల్సిన మర్యాద లభించలేదనే బాధ, వెలితి తెలంగాణ బిడ్డలకు ఉంది. అందులో సందేహం లేదు. దానికి బాధ్యులెవరూ, మంచి, చెడు గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. పీవీ శతజయంతి ఉత్సవల సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పుకుంటున్న సమయంలో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ తీర్మానాన్ని పెడుతున్నాం. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. పీవీ శతజయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడానికి ప్రభుత్వం సÜంకల్పించి జూన్ 28న జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా ఆయన దేశానికి చేసిన సేవలను ప్రజలంతా స్మరించుకునేలా చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మూలకారకుడు పీవీ... ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నిలవడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పురోగమించడానికి మూలకారకుడు పీవీ. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా ఆయన చరిత్ర çసృష్టించారు. అందుకే ఇది పీవీ మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మోడరన్ ఇండియా నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ.. రెండో నేత గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమయ్యేది. కాలానుగుణంగా ఆర్థిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో దేశం ఉంది. మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కాలం విసిరిన ఇన్ని సవాళ్ల నడుమ తనదైన దార్శనికతతో పీవీ ధైర్యంగా ముందడుగు వేశారు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా, వేగంగా, చాకచక్యంగా, సమర్థంగా అమలు చేశారు. ఆయన దార్శనికతే కారణం భారతీయ మేధావులు విదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా... దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా సమకూరాయన్నా... దేశానికి ప్రపంచం నలుదిక్కుల నుంచీ పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నా... స్వదేశీ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనే స్థాయికి ఎదిగాయన్నా... ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం పోటీతత్వం పెరిగిందన్నా... ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్నా... సగటు భారతీయుని జీవనశైలి ఎంతో మారిందన్నా.... వీటన్నిటి వెనకా పీవీ దార్శనికత ఉంది. ఆయన సంస్కరణలనే మొక్కలు నాటితే ప్రస్తుతం మనం వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధానాల విధాత, గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి. విదేశాంగ విధానంలో మేలి మలుపులు పీవీ దౌత్యనీతి ఫలితమే. ‘లుక్ ఈస్ట్ పాలసీ’ప్రవేశపెట్టి సింగపూర్, మలేసియా, ఇండోనేసియా వంటి ‘ఏషియన్ టైగర్స్’కి భారత్‌ను చేరువ చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది ఆయన దూరదృష్టే. ఇప్పుడు ఆ విధానాన్నే ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి, బీజింగ్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాలు భారత్–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం. రెండో అణు పరీక్షకు రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పీవీదే. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన భూ సంస్కరణలకు నాంది పలికారు. దేశంలో భూ సంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన. భూ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేసినందుకు, ముల్కీ రూల్స్‌ను సమర్థించినందుకు ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. అయినా పీవీ చలించలేదు. అనన్య సామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్యలపై లోతైన అవగాహన ఉన్న పీవీ... విద్యా మంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవవనరుల శాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారెందరో ఉన్నతస్థాయి పదవులు పొందారు. ఉన్నత ఉద్యోగాలలో రాణించారు. అన్ని కోర్సుల అకడమిక్ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని పీవీ నెలకొల్పారు. పీవీ వ్యక్తిత్వం ఒక సహస్రదళ పద్మం. అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలోను అనర్గళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు. రాజకీయాల్లో మునిగి తేలుతూనే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ’వేయి పడగలు’బృహన్నవలను హిందీలోకి సహస్ర ఫణ్ పేరుతో అనుసృజించారు. ఎన్నో కథలు, పద్యాలు, గేయాలు, నవలికలు రాశారు. చిన్న గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించి ఓయూ నుంచి బహిష్కరణకు గురైనా పీవీ వెరవలేదు. మహారాష్ట్ర వెళ్లి నాగపూర్, పుణెలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. పేదలపట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీపట్ల, ఆదర్శాలపట్ల అంకితభావంతో ఉన్న ఆయన రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ప్రధానిగా సర్వోన్నత పదవిని అధిష్టించారు. అటువంటి మహనీయుడికి, తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచ మేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి భారతరత్న పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించడం సముచితంగా ఉంటుంది.’ తీర్మానం ఇదే.. ’తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వల దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్టించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది’అని సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, కేసీఆర్ సూచన మేరకు శాసనసభ ప్రాంగణంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. మండలిలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి సైతం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేసీఆర్ తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి పీవీ దార్శనికతను కొనియాడారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు టి. జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీష్, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు ప్రసంగించారు. నెక్లెస్ రోడ్డుకు ‘పి.వి. నరసింహారావు నెక్లెస్ రోడ్డు’గా నామకరణం చేయాలని, పదో తరగతి పాఠ్యాంశాల్లో పీవీపై ఒక చాప్టర్‌ను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఈ తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. వర్షాకాల శాసనసభ రెండో రోజు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని, ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గ్లోబల్ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని కేసీఆర్ తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పీవీ పాలన చేశారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలిచినవారే చరిత్రను రాస్తారని తెలిపారు. పీవీ స్థాయికి తగ్గ విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటమని పీవీ చెప్పారని గుర్తు చేశారు. కాగా, నేడు అసెంబ్లీలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును మంత్రి సబితారెడ్డి సభలో పెట్టనున్నారు. తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్లు -2020, ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. -
పీవీ ప్రపంచ మేధావి: శశి థరూర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విదేశీ విధానాలపై ఇందిరాభవన్‌లో ఆదివారం వెబ్‌నార్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ పాల్గొని ప్రసంగించారు. శిశిథరూర్ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం విషయంలో పీవీ నర్సింహరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు చేసుకొని, విదేశాంగ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇరాన్‌తో పటిష్టమైన బంధం ఏర్పరిచారని, దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించారని చెప్పారు. (ఎన్ఎస్యూఐ దీక్ష విరమణ) చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అనేక వ్యూహాలు రచించి, కమ్యూనిజం నుంచి క్యాపిటలిజం వైపు వేగంగా అడుగులు వేశారని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచి, రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడిచి ఆర్థికంగా దేశాన్ని పటిష్టమైన స్థానానికి చేర్చారని అన్నారు. కేవలం 1991 నుంచి రెండేళ్లలో లిబరలైజేషన్‌తో 36 శాతం ఎకానమి పెంపొందించారని చెప్పారు. దేశ ఆర్థిక విధానాల విషయంలో పీవీ నర్సింహరావుకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చుని వివరించారు. పీవీ నేతృత్వంలో భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. 1991 నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఎకానమిని పరుగులు పెట్టించారని అన్నారు. పీవీ ప్రతీ నిర్ణయం దేశం అభ్యున్నతికి పాటుపడిందని, మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చాణక్యంతో నడపగలిగారని కొనియాడారు. ఆయన ప్రపంచ మేధావని దాదాపు 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ సాధించడంలో కీలకపాత్ర పోషించి, ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, కమిటీ చైర్మన్ గీతరెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
పివి సమాలోచన సభ
-
పీవీ స్ఫూర్తితో అధికారంలోకి..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ నేతృత్వంలో ఇందిరాభవన్‌లో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. కమిటీ చైర్పర్సన్, మాజీమంత్రి జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పంపిన సందేశా న్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదివి వినిపించారు. ‘పీవీ స్ఫూర్తితో పనిచేసి 2023లో తెలంగాణ లో అధికారంలోకి వస్తాం..’అని సోనియా పేర్కొ న్నారు. వర్చువల్ సమావేశంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మాజీమంత్రులు చిదంబరం, జైరాంరమేశ్ జూమ్ యాప్ ద్వారా పాల్గొని మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరుడు మనోహర్‌రావు, కమిటీ గౌరవ చైర్మన్ వి.హనుమంతరావు, వైస్ చైర్మన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేశ్‌గౌడ్, నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, దాసోజు శ్రావ ణ్, అనిల్ యాదవ్, మల్లు రవి, రుద్ర రాజు, వేణుగోపాల్, సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పీవీ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పీవీ గురించి ఎవరేమన్నారంటే... రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించారు: చిదంబరం ‘రాజకీయాల్లో నన్ను పీవీ ఎంతో ప్రోత్సహించారు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నన్ను ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రోత్సహించారు. ఆయన తెచ్చిన పారిశ్రామిక విధానం మరువలేనిది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ రూపకర్త’ భూసంస్కరణల ఘనత ఆయనదే: ఉత్తమ్ ‘వంగర గ్రామంలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసి ప్రధాని స్థాయికి ఎదిగారు పీవీ. వ్యక్తిగతంగా ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదే. ఆయన పుట్టుక నుండి చనిపోయే వరకు కాంగ్రెస్‌వాది. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే తీర్మానం చేసినం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని ఆదుకున్నది పీవీ సంస్కరణలే. జూలై 24, 1991 నాటి కేంద్ర బడ్జెట్ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది’ అవేమీ లేకుండా పాలించారు: భట్టి ‘మజిల్, మనీ పవర్ లేకుండా సువిశాల భారత దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగారు పీవీ. ఆయనకు అలాం టి గొప్ప స్థాయిని కాంగ్రెస్ కల్పించింది. ఆయన రాజకీయ జీవితానికి వన్నె తెచ్చింది ఇందిరాగాంధీ అయితే సోనియాగాంధీ సలహా మేరకు ఏఐసీసీ ఆమోదంతో ప్రధాని అయ్యారు. సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చన్న విషయాన్ని పీవీ రుజువు చేశారు..’ -
పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పీవీ స్మారకంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని తాను ప్రతిపాదన పంపగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు ఆమోదం తెలిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. త్వరలోనే పోస్టల్ శాఖ ద్వారా ఈ స్టాంప్ విడుదల కానుందని ఆయన పేర్కొన్నారు. కేకే హర్షం మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ‘ప్రత్యేక తపాలా బిళ్ల’విడుదల చేస్తుండటంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు గురువారం హర్షం వ్యక్తంచేశారు. ఇందుకోసం చొరవ చూపిన సీఎం కేసీఆర్‌కు, కేంద్రానికి ఈ సందర్భంగా కేకే కృతజ్ఞతలు తెలియజేశారు. -
సింగపూర్‌లో ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు
కౌలాలంపూర్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను సింగపూర్ ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి వెంకట రమణారెడ్డి, బైర్నేని రావు రంజిత్ మాట్లాడుతూ బహుభాషావేత్త, రచయిత, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు సేవలను గుర్తుచేసుకున్నారు. కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడారు. దేశానికి ఎనలేని సేవ చేసిన పీవీని భారతరత్నతో గౌరవించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతిస్తామని చెప్పారు. ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కె.చంద్రశేఖర్ రావుకి సింగపూర్ ఎన్నారై తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాల మురళి మోహన్ రెడ్డి, మాచాడి రవీందర్ రావు, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బద్దం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు
లండన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్, పీవీ తనయ వాణి దేవి, లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల పాల్గొని ప్రసంగించారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ పీవీని చైనా సంస్కరణలకు ఆద్యుడు డెంగ్ జియావోపింగ్‌తో పోల్చారు. భారతదేశం పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలతో గాడిలో పడిందన్నారు. ‘ఆనాటి నుండి నేటి వరకు అందరూ పీవీ విధానాలనే అనుసరిస్తున్నారు. పంజాబ్ లో శాంతి నెలకొల్పడంలో ఆయన సఫలం అయ్యారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో చాలా వరకు సఫలం అయ్యారనే చెప్పుకోవొచ్చు. ఇంకో 15 ఏళ్లు పీవీ ప్రధానిగా ఉండి ఉంటే ప్రగతి చైనాను అధిగమించేవాళ్లం’ అని అన్నారు. పీవీ తనయ వాణి దేవి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు కూతురిని కావడం నాకు గర్వంగా ఉంది. ఆయన స్థిత ప్రజ్ఞుడు. ఎలాంటి సందర్భాల్లోనూ కోపం తెచ్చుకోని వ్యక్తి. సమయపాలన, క్రమశిక్షణ ఆయన విజయానికి మెట్లు. బాల్యం నుంచే ఆయన ఏకసంతాగ్రాహి అని మా నానమ్మ చెబుతుండేవారు. రెండున్నర ఏళ్లకే కఠిన పద్యాలను కంఠస్తం చేశారు. అందరూ ఆయన్ను మృదు స్వభావి అనుకుంటారు కానీ మహారాష్ట్రలో తుపాకుల శిక్షణనిచ్చారు. పీవీ రచనలు, ఆయన అందుకున్న బహుమతులు, ఆయనకు ఇష్టమైన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. ‘పీవీతో మా నాన్న మంచి అనుబంధం ఉంది. 2016లో ఇండియాకు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిని సందర్శించాను. ప్రపంచ రాజకీయ నాయకులకు ఆయన మార్గదర్శి. బ్రిటన్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా’ అని ఎంపీ వీరేంద్ర శర్మ తెలిపారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నట్లు తెలిపారు. సంవత్సరం పొడవునా పీవీ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీఈఎన్ఎఫ్ ప్రెసిడెంట్ గంప వేణుగోపాల్ ప్రతిపాదించగా, పాల్గొన్న అన్ని సంఘాలు స్వాగతించాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షుడు సుమన్ రావు, యుక్త సంస్థ తరఫున కిల్లి సత్యప్రసాద్, మహేశ్ జమ్ముల, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, బహ్రయిన్ తదితర దేశాలకు చెందిన 130 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శత జయంతి సందర్భంగా టేన్ఫ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మరో కార్యక్రమంలో సంస్థ కార్యవర్గంతో పాటు టీడీఎఫ్ ప్రతినిధులు కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధులు సుమన్ రావు, కిషోర్ మునగాల, సంతోష్ ఆకుల, కిల్లి ప్రసాద్, యుక్త, రాములు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ఇంకో కార్యక్రమంలో ఉదయ్ నాగరాజు, వైరాజిస్టు బాల శ్రీనివాస్, లండన్ కార్పొరేటర్ ప్రభాకర్ ఖాజా, ఉదయ్, రెహానా, మోహన్ మద్ది, విజన్ తెలంగాణకు చెందిన శ్రీధర్ గౌడ్, నాట్స్‌కు చెందిన గంగసాని రాజేశ్వర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు. -
సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త పీవీ
సాక్షి, అమరావతి: దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ‘పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త. అంతే కాదు, ఒక బహుభాషా కోవిదుడు. ఈ దేశాన్ని పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాల వైపు నడిపించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ప్రధాని, రాష్ట్రపతిని అందించిన నంద్యాల
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని అందించిన ఘనత ఈ సెగ్మెంట్ దక్కించుకుంది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ప్రధాని పీవీ నరసింహరావు నంద్యాల నుంచి విజయం సాధించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికంటే ముందు.. 1977లో జరిగిన ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా జనతా పార్టీ తరఫున ‘నీలం’ ఒక్కరే గెలిచి రికార్డు సృష్టించారు. ఇక 1991లో ప్రధానిగా పీవీ నరసింహరావు ఎన్నికవడంతో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పీవీ కోసం రాజీనామా చేశారు. ఇక్కడినుంచి పీవీ రెండుసార్లు విజయం సాధించారు. -
విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది. బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్‌రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి -
నంద్యాల ఖ్యాతి.. దేశ వ్యాప్తి
సాక్షి, నంద్యాల(ఎలక్షన్ డెస్క్): రాష్ట్రపతి, ప్రధానమంత్రులను అందించిన ఘనత నంద్యాల నియోజకవర్గానికి దక్కుతుంది. 1971లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలను కైవసం చేసుకుంది. నంద్యాలలో మాత్రం ఇందిరా గాంధీతో విభేదించి జనతాపార్టీ తరఫున పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పెండెకంటి వెంకటసుబ్బయ్యపై 35,743 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై మూడు నెలలు పనిచేసి తర్వాత 1977 నుంచి 1982 వరకు 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే దేశ 10వ ప్రధానిగా పీవీ నరసింహరావు 1991 జూన్ 21న బాధ్యతలు చేపట్టారు. ఆయన పార్లమెంట్లో సభ్యుడు కాకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. అప్పటి నంద్యాల ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డిని రాజీనామా చేయించి ఇక్కడి నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తరువాత పీవీ 1996లో నంద్యాలతో పాటు ఒరిస్సాలోని బరంపురం నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో నంద్యాలకు రాజీనామా చేశారు. అలాగే బనగానపల్లెకు చెందిన పెండెకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. -
రాజకీయ ఉద్దండులు.. ఆ ఇద్దరు నేతలు
మెట్పల్లి(కోరుట్ల): ఆ ఇద్దరు నేతలు..పాత కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి, ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఒకరు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. మరొకరు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో చెరగని ముద్రను వేసి ‘కరీంనగర్ కీర్తిని’ జాతీయస్థాయిలో చాటారు. వారిలో ఒకరు పీవీ నర్సింహారావు కాగా, మరొకరు చెన్నమనేని విద్యాసాగర్‌రావు. మంథని నుంచి పీవీ అడుగులు.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నర్సింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962,67,72లో వరుసగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ,సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఈ పదవీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1984, 89 సంవత్సరాల్లో మహరాష్ట్రలోని రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన తన హయాంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దివాలా తీసే పరిస్థితిలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం పోశారు. మారుమూల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పీవీ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు. మెట్పల్లిలో వికసించిన ‘సాగర్జీ’ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారాం చెన్నమనేని విద్యాసాగర్‌రావు స్వగ్రామం. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై అసక్తి కనబర్చిన సాగర్జీ ఏబీవీపీలో చురుకుగా వ్యవహరించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989, 1994లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాదికి జరిగిన ఎన్నికల్లోనూ మరోమారు గెలుపొందారు. ఆ సమయంలో వాజ్‌పేయ్ ప్రభుత్వంలో హోం, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. సుమారు రెండు దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన సాగర్జీ 2004నుంచి రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆ సంవత్సరం లోక్‌సభకు జరిగిన ఎన్నిల్లో పరాజయం పాలయ్యారు. 2009లోను మరోసారి పరాభావం ఎదురైంది. దీంతో ఆయన తిరిగి అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టిసారించి 2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయినా ఆ ఎన్నికల్లోను విజయం దక్కలేదు. 2014లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీ చేయగా, అప్పుడూ చేదు అనుభవమే ఎదురైంది. వరుస పరాజయాలతో ఇక సాగర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్లేననే ప్రచారం జరిగింది. కాని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఊహించని విధంగా ఆయనను మహరాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించి సముచితంగా గౌరవించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానికి లేఖ రాశా రు. 60 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రధానిగా, ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి విశిష్ట సేవలు అందించారని లేఖలో గుర్తు చేశారు. ప్రధానిగా పనిచేసిన సమయంలో దేశ జీడీపీని పరుగులు పెట్టించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు. పౌర సేవల హక్కు చట్టంపై లేఖ.. పాలనలో పారదర్శకతకు రూపొందిస్తున్న పౌర సేవల హక్కు చట్టం రూపకల్పనలో ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని జానారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎంకు లేఖ రాశారు. చట్టం విషయంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. చట్టంపై లోక్‌సత్తా సమర్పించిన ముసాయిదాను లేఖతో పాటు కేసీఆర్‌కు పంపారు. -
పీవీ 'హాఫ్ లయన్'లో ఏముంది?
పీవీ నరసింహారావు జీవితంపై వినయ్ సీతాపతి వ్రాసిన హాఫ్ లయన్ పుస్తకం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. పివి జీవితం గురించి సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత. ఇటీవలే ఈ పుస్తకావిష్కరణకోసం హైదరాబాద్ వచ్చిన వినయ్ సీతాపతితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ .... పీవీ నరసింహారావు చనిపోయి పదేళ్లు దాటిపోయిన తరువాత ఆయనపై పుస్తకం వ్రాయాలని మీకు ఎందుకు అనిపించింది? రెండు ప్రధాన కారణాలున్నాయి. నేను సరళీకృత ఆర్ధిక విధానాల తరానికి చెందిన వాడిని. 1990 లో ముంబాయి లోని బంద్రాలో పిల్లలుగా ఉన్న మాకు పీవీ నరసింహారావు ఎవరో తెలియదు. కానీ ఆయన వల్ల కలిగిన అనేక మార్పులను మేము కళ్లారా చూశాం. మా నాన్నగారు పబ్లిక్ సెక్టర్ సంస్థ ను వదిలి ప్రైవేటు రంగానికి వెళ్లిపోయారు. మెక్‌డోనాల్డ్ ను అప్పుడే చూశాం. మౌలిక వసతులలో మార్పులు చూశాం. 1993 లో తొలి ప్రైవేటు ఎయిర్ లైనర్ ఆకాశంలోకి ఎగిరింది. ప్రతి భారతీయుడినీ ఆయన స్పృశించారు. అంతకు ముందుకన్నా జీవన స్థితిగతులు మెరుగయ్యాయి. ఈ కథను రాయాల్సిన అవసరం ఏర్పడింది. రెండేళ్ల క్రితం నేను ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ వ్రాసిన డెంగ్ జియావో పింగ్ అండ్ ది ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫ్ చైనా అన్న పుస్తకం చదివాను. చైనాను 80 వ దశకంలో డెంగ్ ఎలా మార్చాడో ఆ పుస్తకంలో వివరించారు. దాన్ని చదివిన తరువాత మన దేశం గురించి వ్రాయాల్సిన అవసరం ఉందని అనిపించింది. దేశాన్ని మార్చిన వ్యక్తి నరసింహారావు. అందుకే ఆయన గురించి వ్రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ పుస్తకం కోసం ఎలాంటి పరిశోధనలు చేశారు? ఎవరెవరిని కలిశారు? ఆయనతో కలిసి మెలిసి సన్నిహితంగా ఉన్నవారిని కలవగలిగారా? పీవీకి చెందిన ఒరిజినల్ వ్రాతప్రతులు మీకు లభ్యం అయ్యాయా? నేను 110 కి పైగా ఇంటర్వ్యూలు చేశాను. మన్మోహన్ సింగ్, పీవీ కి అత్యంత సన్నిహితురాలైన కళ్యాణి శంకర్, ఆయన వ్యక్తిగత డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పీవీ వంటవాడిగా దాదాపు వంద దేశాలు ఆయనతో పాటు తిరిగిన రాజయ్యలను కూడా కలిశాను. పీవీని వ్యతిరేకించిన మణిశంకర్ అయ్యర్, బ్యూరోక్రాట్ కె ఆర్ వేణుగోపాల్ లలను కూడా కలిశాను. ఈ పుస్తకంలో పీవీ గురించిన మంచి ఉంది. చెడు కూడా ఉంది. మనుషులందరిలోనూ మంచీ చెడూ ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ తరువాత సర్వోత్తమ ప్రధాని పీవీయే అని నా పుస్తకంలో వాదించాను. ఆయనకు సంబంధించిన రెండు వందలకు పైగా పుస్తకాలను చదివాను. ఆయన కుటుంబ సభ్యులు నాకు ఆయన పత్రాలన్నిటినీ నాకు ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా అందచేశారు. పీవీ నాగరికతల సంఘర్షణ వంటి పరిశోధనా పత్రాలపై తన నోట్స్ చాలా వివరంగా వ్రాసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన లేఖరు,, పత్రాలు, నోట్స్ అన్నీ నాకు లభించాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఆయన 1976 నుంచి 1996 వరకూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి పత్రమూ ఆయన చేతుల మీదుగానే వెళ్లింది. ప్రతి రోజూ సాయంత్రం ఆయన ఆ రోజు విశేషాలన్నిటినీ కంప్యూటర్ లో నమోదు చేసేవారు. ఒక రాజకీయ వ్యక్తి జీవిత చరిత్ర రాయడానికి కావలసిన సమాచారమంతా ఆయన అందించి వెళ్లారు. నేను ఇంటర్ వ్యూ చేసిన ప్రతి వ్యక్తికీ ఆయన చెప్పిన విషయాలను ఏ విధంగా పు్స్తకంలో పొందుపరచబోతున్నానో చెబుతూ ఈ మెయిల్స్ వ్రాశాను. అందుకే ఎన్నో వివాదాస్పద అంశాలున్నా ఎవరినైనా తప్పుగా ఉటంకించాననో, ఉదహరించాననో ఎవరూ చెప్పలేదు. సోనియా గాంధీకి సన్నిహితులైన వారిని ఇంటర్ వ్యూ చేయగలిగారా? జయరామ్ రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, సతీశ్ శర్మలను ఇంటర్వ్యూ చేశాను. చాలా మంది ఇంటర్వ్యూలు ఇచ్చినా తమ పేర్లు బయటపెట్టవద్దని కోరారు. దానికి కారణాలు ఏమిటో చెప్పనవసరం లేదు. నేను వారి మాటను గౌరవించాను. పీవీ ఎలా ఉండేవారు. ఆయన గురించి చాలా మందే వ్రాశారు. ఆయన జీవితం, ఆయన భాషా పాండిత్యం, ఆయన ఆర్ధిక ఆలోచనలు, విదేశ వ్యవహారాల్లో ఆయన లోతు, ఆయన రాజకీయ చాణక్యం గురించి చాలానే సమాచారం ఉంది. కానీ మీ పుస్తకం చదివితే ఆయన ఒంటరిగా, నిస్సహాయుడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు.? పీవీ నరసింహారావు వ్యక్తిత్వంలోని అతి ముఖ్యమైన అంశం ఆయనలోని ఒంటరి తనం. ఇది ఆయన బాల్యం నుంచే వచ్చిందని నాకు అనిపించింది. పదేళ్ల వయసు వచ్చేనాటికే ఆయనకు ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆయన చాలా తెలివైన విద్యార్థి కావడంతో తండ్రి వేరే చోట చదువుకునేందుకు పంపించారు. దీంతో ఆయన మిత్రులకు దూరమయ్యారు. ఆయనను పొరుగువారికి దత్తత ఇచ్చారు. ఈ మూడు పరిణామాల వల్ల ఆయనలో ఎనలేని ఒంటరి తనం చోటు చేసుకుంది. ఆయన పుస్తకాల పురుగులా మారారు. ఈ వ్యక్తిగత జీవితంలోని ఒంటరితనం ఆయనకు రాజకీయాల్లో ఆస్తిగా మారింది. ఆయన ఒంటరి వాడు కాబట్టే 1971 లో ఇందిరా గాంధీ ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నియమించింది. ఇదే కారణం వల్ల సోనియా గాంధీ ఆయనను 1991 లో ప్రధానమంత్రి చేసింది. శరద్ పవార్, అర్జున్ సింగ్ లలాగా ఆయనకు తనదైన వర్గం లేదు. అందుకే ఆయన అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు. ఒక రాజకీయ వేత్తగా ఆయన ప్రయాణం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఎలా సాగింది? ఆయన తొలి దశలో సోషలిస్టు. ఆయనపై నెహ్రూ, రామానంద తీర్థల ప్రభావం ఉండేది. వారిద్దరూ కాంగ్రెస్ లో సోషలిస్టు భావాలు కలిగి ఉండేవారు. ఇందిరా గాంధీ ఆయనను ముఖ్యమంత్రిగా తొలగించిన తరువా ఆయన అమెరికాలో పర్యటిస్తారు. అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. అప్పటికీ ఆయన హృదయం సోషలిస్టు. కానీ మెదడు యథార్థవాదిగా ఉన్నాయి. మార్కెట్ శక్తుల వల్ల లాభాలున్నాయని కూడా ఆయన గ్రహించారు. సోవియత్ కి దూరంగా వెళ్లాలని ఆయన అప్పుడే నిర్ధారణకి వచ్చారు. మరో వైపు ఆయన రాజకీయ నైపుణ్యాలు కూడా వికాసం చెందుతూ వచ్చాయి. ఆయనది ఆకర్షణీయ వ్యక్తిత్వం కాదు. ప్రజలు ఆయనను పెద్దగా ప్రేమించలేదు. ఆయనకు పార్టీ పై పట్టు లేదు. పార్లమెంటులో మైనారిటీ. ఇంత బలహీన పరిస్థితుల్లో ఇన్ని సంస్కరణలు చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు లేరు. డెంగ్ జియావో పింగ్ తో పోల్సి చూస్తే, ఇద్దరూ కోట్లాది మంది జీవితాలను మార్చారు. కానీ డెంగ్ కి పార్టీపై పూర్తి పట్టు ఉండేది. ఆయన నియంతృత్వ పాలన సాగించారు. పీవీకి ఇవేవీ లేవు. కానీ ఆయన స్వాతంత్ర్యానంతర కాలంలో నెహ్రూజీ తెచ్చిన మార్పును తేగలిగారు. నెహ్రూకి ప్రజాకర్షణ ఉండేది. పార్టీపై పట్టు ఉండేది. పార్లమెంటులో మెజారిటీ ఉండేది. పూర్తి బలం లేకపోయినా మార్పులు సాధించగలడడం ఆయన సామర్థ్యానికి అద్దం పడుతుంది. నా పుస్తకం కేంద్ర బిందువు ఇదే. మన్మోహన్ సింగ్ ను ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడంటారు. కానీ మీ పుస్తకం ప్రకారం పీవీ ఆర్ధిక సంస్కరణలకు చాలా ముందు నుంచే యథార్థవాదిగా మారారు. కాబట్టి పీవీని యదార్థ సంస్కరణ వాదిగా చెప్పవచ్చా? నరసింహారావు సంస్కరణలకు ఆద్యుడనటం లో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన సూక్ష్మస్థాయిలో సంస్కరణలను తేగలిగారు . టెలికాం విధానం వంటి పత్రాల్లో ఆయన వ్రాసిన నోట్స్ ను నేను చూశాను. ఆయన సంస్కరణల ఫలితంగానే ఈ దేశంలో వంద కోట్ల మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఆయన ప్రైవేటు రంగాన్ని టెలికామ్ లోకి రానిచ్చారు. ఆయన విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఆమ్వానించారు. సంస్కరణ రాజకీయంగా ప్రజాదరణ పొందవని ఆయనకు తెలుసు. అందుకే ఆయన సంస్కరణలను తానే తెచ్చానని చెప్పుకోలేదు. అయితే మన్మోహన్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. పీవీ రాజకీయ కారణాల వల్ల పొరబాట్లు చేస్తూ ఉంటే ఆయనను సరిదిద్దారు. ఆయన పీవీకి నమ్మకమైన అనుచరుడిగా నిలిచారు. చాలా మంది కాంగ్రెస్ వారి వలె కాకుండా ఆయన పీవీ పట్ల కృతజ్ఞతతలో ఉన్నారు. పీవీ హయాంలో రెండో అతి ముఖ్యమైన అంశం బాబ్రీ ఉదంతం. బాబ్రీ కట్టడాన్ని కూల్చేస్తూంటే ఆయన నిద్ర పోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మీ పుస్తకం ఆయన నిద్రపోలేదని, పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారని చెబుతోంది. ఆయన అద్వానీని నమ్మి మోసపోయారని భావిస్తున్నారా? ఆయన ఖచ్చితంగా పొరబాట్లు చేశారు. ఒక్క అద్వానీ విషయంలోనే కాదు. నవంబర్ 15, 1992 నుంచి నవంబర్ 30 వరకూ అన్ని సమావేశాల పత్రాలను నేను పరిశీలించాను. ఆయన హిందూ నేతలందరినీ కలుసుకున్నారు. ఆయన శంకరాచార్యను, అశోక్ సింఘల్ ను, విశ్వహిందూ పరిషద్, ఆరెస్సెస్, బిజెపి నేతలను పదేపదే కలుసుకున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే. బాబరీ కట్టడాన్ని కాపాడమని వేడుకున్నారు. అంటే డిసెంబర్ 6 న ఏదో జరుగుతుందని ఆయన ముందుగానే ఊహించారా? ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది. ఏదో ఒకటి జరగాలి. ఎవరో ఒకరు గెలవాలి. అక్టోబర్ 31, 1992 న విహిప మసీదు పక్కనే పూజ చేస్తామని, మసీదుకు ఏమీ కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అయితే లక్ష మంది కరసేవకులు జమకూడితే మసీదు కుప్పకూలే అవకాశం ఉందన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. నిజానికి ఆ సమయంలో రెండు కట్టడాలు కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి బాబరీ కట్టడం. బిజెపి, సంఘపరివార్ లు దీన్ని కూల్చేందుకు ప్రయత్నించాయి. రెండవది - పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులు పీవీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అర్జున్ సింగ్, శరద్ పవార్ వంటి వారు ఏది ఏమైనా పీవీని తొలగించాలని ప్రయత్నించారు. పీవీకి ఈ ఎత్తుగడలన్నీ తెలుసు. ఆయన సమస్య ఏమిటంటే రాజ్యాంగ పరిధికి లోబడే బాబరీ కట్టడాన్ని కాపాడాలి. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని 356 వ అధికరణం ప్రకారం బర్తరఫ్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఆయన సొంత న్యాయశాఖ మంత్రి, క్యాబినెట్ ఆఖరికి వామపక్షాలు సైతం బర్తరఫ్ చేస్తే సమస్యలు వస్తాయని వాదించాయి. కళ్యాణ్ సింగ్ తాను కట్టడాన్ని కాపాడతానని మాట ఇచ్చారు. జాతీయ సమైక్యతా మండలి, క్యాబినెట్, న్యాయస్థానం ఇలా అన్ని చోట్లా ఆయన ఈ విషయంలో హామీ ఇచ్చారు. కానీ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. నేను క్యాబినెట్ సమావేశం మినట్స్ ను చూశాను. ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం బర్తరఫ్ ను సమర్థించలేదు. పీవీ జీవితంలో రెండు దశలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి మే 21, 1991 కి ముందు. ఆ తరువాత. రాజీవ్ మృతికి ముందు ఆయన సన్యాసి కావాలనుకున్నారు. పుస్తకాల్లో మునిగిపోయారు. కానీ రాజీవ్ చనిపోగానే ఆయన ఒక్కసారి యాక్టివ్ అయిపోయారు. మీ పుస్తకం ప్రకారం ఆయన ప్రధాని కావడానికి చేయాల్సిందంతా చేశారు. ఇది కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. దీనిని కాస్త వివరించగలరా? పీవీ నరసింహారావు లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆయనకు రాజకీయ పరిస్థితులు, సందర్భాల పట్ల ఉన్న లోతైన అవగాహన. గ్రహాలు తనకు అనుకూలమౌతున్నాయని అనిపించిన మరుక్షణం ఆయన తన మనసును మార్చేసుకోగలరు. పరిస్థితులు మారగానే తన మనో భూమికను కూడా మార్చుకుంటారు. ఆయన సన్యాసి అవుదామని అనుకున్నారు. కుర్తాళం పీఠాధిపతి బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ చనిపోయారని ఆయనకు ఫోన్ వస్తుంది. మరుసటి ఉదయం నాలుగున్నరకే ఆయన రాష్ట్రపతి జాయింట్ సెక్రటరీ గోపాల్ కృష్ణ గాంధీకి ఫోన్ చేసి తాను రాష్ట్రపతినిని కలవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎందుకు కలవాలనుకున్నారు అని నేను గోపాల్ గాంధీని అడిగితే ఆయన నవ్వుతూ ఈ సమావేశం క్షేమ సమాచారాల కోసం జరిగిన సమావేశం మాత్రం కాదని అన్నారు. పీవీ డైరీ కూడా ఆయన తనకు ప్రధాని అయ్యే అవకాశం ఉందని పేర్కొంటుంది. ఆయితే ఆయన ఎంత తెలివైన వారంటే కోరికలు ఎన్ని ఉన్నా, పథకాలు ఎన్ని రచించినా తనకు పదవి కావాలన్న ఆకాంక్ష ఉన్నట్టు తెలిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయనకు తెలుసు. ఆయనకు సోనియా గాంధీకి మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి? ప్రధానకారణం ఏమిటి? నిజానికి పీవీ ఎదుర్కొన్న అనేక సమస్యల్లో సోనియా గాంధీ ఒక సమస్య మాత్రమే. ఆయన పార్టీ ఆయనను ద్వేషించేది. ఇందులో సోనియా ప్రమేయమేమీ లేదు. నిజానికి తొలి రెండు సంవత్సరాలు రాజీవ్ మరణంతో ఆమె పెను విషాదంలో ఉన్నారు. ఆమెకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తీ లేదు. ఆమెను మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆమె ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవాలని కూడా అనుకున్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. అయితే 1993 నుంచి ఆమె పార్టీలోనే పివికి వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించింది. అసలు విషాదమంతా ఆయన రాజీనామా చేసిన తరువాత ఆయన పట్ల వ్యవహరించిన తీరులోనే ఉంది. సోనియా, కాంగ్రెస్ పార్టీల వ్యవహారశైలి సిగ్గుపడాల్సిన రీతిలో ఉంది. ఆయన భౌతిక కాయాన్ని అవమానపరిచారు. ఆయన కేసులకు హాజరవుతుంటే ఒక్కరూ తోడు రాలేదు. పార్టీ వెబ్ సైట్ లో పార్టీ ఆర్ధికసంస్కరణల చరిత్ర గురించి వ్రాసినప్పుడు అందులో పీ వీ పేరే లేదు. ఆయన జ్ఞాపకాలను చెరిపేయాలన్న ప్రయత్నం అనవసరం. కానీ ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అంతే కాదు. ఆయన వారసత్వం మాది అని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ఆయనను తిరస్కరిస్తే, బిజెపి, టీఆర్ఎస్లు ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తాయి.