సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త పీవీ | YS Jagan Mohan Reddy Praises PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త పీవీ

Published Mon, Jun 29 2020 3:00 AM | Last Updated on Mon, Jun 29 2020 3:00 AM

YS Jagan Mohan Reddy Praises PV Narasimha Rao - Sakshi

సాక్షి, అమరావతి: దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ‘పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ఒక సునిశిత బుద్ధి గల రాజకీయవేత్త. అంతే కాదు, ఒక బహుభాషా కోవిదుడు. ఈ దేశాన్ని పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాల వైపు నడిపించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement